కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తాజాగా ఆయన నటించిన ‘సత్యం సుందరం’ చిత్రం విడుదలై థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కార్తీ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. ఆయనతో పాటు ఈ సినిమా దర్శకుడు ’96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ కూడా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సోమవారం ఉదయం వీరు అమ్మవారి ఆలయానికి విచ్చేసారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం హీరో కార్తీకి, దర్శకుడు ప్రేమ్‌కి స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































