ట్యాగ్ · 19 కథనాలు

కళ్యాణ్ బాబూ.. ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం

ఓజీ గ్లింప్స్ రిలీజ్


తమ్ముడికి అన్న బర్త్ డే విషెస్

రిలీజ్ అయిన హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ వీడియో

అందరికీ కృతజ్ఞతలు - పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ కు మెగా పవర్ స్టార్ బర్త్ డే విషెస్

'PSPK 28' జాతర షురూ

'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ కు 'మెగా' బర్త్ డే విషెస్

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్
పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఆయనకు తన సోదరుడు, టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయనకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే పవర్ స్టార్, డిప్యూటీ సీఎం (డీసీఎం) పవన్ కళ్యాణ్ గారు’ అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

కళ్యాణ్ బాబూ.. ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తన సోదరుడు, టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. అందులో తమ్ముడిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న మెగాస్టార్.. కళ్యాణ్ బాబూ, ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం అని పేర్కొన్నారు. దీంతో ఈ అన్నదమ్ముల అనుబంధాన్ని మెచ్చుకుంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్ పోస్టర్ రిలీజ్
పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భగత్ సింగ్ ఫై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు 20శాతం షూటింగ్ జరుపుకోగా త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ లో పవన్ మాస్ గా కనిపించాడు.

తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అన్నయ్య చిరంజీవి బర్త్ డే విషెస్
టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. నేటితో ఆయన 51 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52వ పడిలోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఆయనకు అభిమానులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా పవన్‌తో కలిసి తాము దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా తన తమ్ముడు జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కలయికలో కొత్త సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినిపిస్తే అభిమానులకు పూనకాలే. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా ఆయనను పిచ్చిగా అభిమానిస్తుంటారు మెగా ఫ్యాన్స్. అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయాలలో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ పవన తన అభిమానులకు వినోదం పంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి అభిమానులు మరిన్ని ఎక్కువ సినిమాలు రావాలని కోరుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూనే.. మరోవైపు వరుసగా సినిమాలు చేసుకుంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఆయన కథానాయకుడిగా.. ఇప్పటికే 'హరిహరవీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

పవర్ స్టార్ బర్త్ డే వేళ.. హరి హర వీరమల్లు కొత్త పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతూ అనేక పోస్టులు పెడుతున్నారు. ఇక మరోవైపు పవన్ కొత్త చిత్రాల నిర్మాతలు కూడా ఆయా సినిమాలకు సంబంధించి కీలక అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్దరాత్రి 12:17కి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాలోని న్యూలుక్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్ అందించింది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ ఒక పోస్ట్ చేసింది. అందులో.. ఇక 'ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు యొక్క అసాధారణమైన ధైర్యసాహసాలు…

ఓజీ గ్లింప్స్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.100 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈ గ్లింప్స్ హైప్ కు ఏమాత్రం తగ్గకుండా వుంది.గ్లింప్స్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ గా పవన్ రూత్ లెస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.గ్లింప్స్ లో పవన్ లుక్,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది.పవన్ ను ఇంతకుముందు ఎప్పుడూ చూపించని విధంగా చూపిస్తున్నాడు డైరెక్టర్ సుజీత్.

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ మన:పూర్వక కృతజ్ఞతలు- పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖుల , రాజకీయ నేతల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తాయి. సూపర్ హిట్ మూవీస్ జల్సా , తమ్ముడు స్పెషల్ షోస్ తో అభిమానులు తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. తన పుట్టినరోజుని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనను విడుదల చేశారు.

తమ్ముడికి అన్న బర్త్ డే విషెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ పుట్టినరోజు. ఈరోజు కోసం అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఆరోజు రానే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఇక ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మరోవైపు ఈ క్రమంలో అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకుల నుండి పవన్ కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో తన తమ్ముడుకి అన్న చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ…

రిలీజ్ అయిన హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ వీడియో
ఏ ఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.హరిహర వీరమల్లు మూవీ లోని ఒక భారీ యాక్షన్ సీన్ కై ఒక ప్రత్యేకమైన సెట్ ను మేకర్స్ రెడీ చేయించారు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం…

హరిహర వీరమల్లు నుండి పవర్ గ్లాన్స్ కు టైమ్ ఫిక్స్
సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు.ఇక పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇప్పటికే స్పెషల్ షోస్ నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. జల్సా ఇంకా తమ్ముడు సినిమాల స్పెషల్ షోలను నిర్వహించనున్నారు. ఇక అలానే మరోవైపు పవన్ సినిమాల నుండి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుండి అప్ డేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్.

తమ్ముడు పవర్ స్టార్ బర్త్ డే కు మెగా స్టార్ అడ్వాన్స్ విషెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2 )కు ఫ్యాన్స్ చేసే హంగామా తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2) సందర్భంగా సూపర్ హిట్ జల్సా , తమ్ముడు మూవీస్ స్పెషల్ షోస్ ను అభిమానులు ప్లాన్ చేశారు. బర్త్ డే కు ఒక రోజు ముందుగానే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లో సెప్టెంబర్ 1న 4K క్వాలిటీతో తమ్ముడు , జల్సా మూవీస్ స్పెషల్ షోస్ ను ఫ్యాన్స్ ప్లాన్ చేశారు.

అందరికీ కృతజ్ఞతలు - పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డేని పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పవన్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పవర్ స్టార్ కు మెగా పవర్ స్టార్ బర్త్ డే విషెస్
కమ్ బ్యాక్ మూవీ బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్”మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్””హరిహర వీరమల్లు” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు , అభిమానులు పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్‌లు, భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి అభిమానులు తమ ప్రేమను తెలియజేశారు.

'PSPK 28' జాతర షురూ
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వరుస అప్ డేట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి. ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీర మల్లు’, సురేందర్ రెడ్డి సినిమాల అప్ డేట్లు ఇప్పటికే రాగా.. ఇప్పుడు హరీష్ శంకర్ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది.

పవన్-సురేందర్ రెడ్డి సినిమా.. న్యూ పోస్టర్ రిలీజ్
రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈఏడాది వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ లిస్ట్ లో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో సురేందర్ రెడ్డితో వస్తున్న సినిమా కూడా ఒకటి. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి కూడా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సురేందర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో “యథా కాలమ్ తథా వ్యవహారమ్…” అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్, సైబర్ టవర్ ను చూపించడం ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ ను చూస్తుంటే యాక్షన్ డ్రామా గా ఈసినిమా…

'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్
ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో నేడు పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా పవన్-క్రిష్ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. పవన్-క్రిష్ కాంబినేషన్లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో హరిహర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తుండగా.. అది పూర్తయిన వెంటనే ఈసినిమాను మొదలుపెట్టనున్నాడు.

పవర్ స్టార్ కు 'మెగా' బర్త్ డే విషెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నేడు పవన్ పుట్టినరోజు రానే వచ్చింది. దీంతో అభిమానులు సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ నాయకుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. "చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా…

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కే హంగామా చేసే అభిమానులు బర్త్ డే (SEP 2 వ తేదీ )సందర్భంగా పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్‌లు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలియజేస్తున్నారు. "వకీల్ సాబ్" చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ "భీమ్లా నాయక్"మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న"హరిహర వీరమల్లు" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.