హరిహర వీరమల్లు నుండి పవర్ గ్లాన్స్ కు టైమ్ ఫిక్స్

Time Locked For Hari Hara Veera Mallu Glance Release, Hari Hara Veera Mallu Glance, Time locked for the power glance Of Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu, Time locked for the power glance, Hari Hara Veera Mallu Latest Update, Hari Hara Veera Mallu New Update, Pawan Kalyan's Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Update, #HariHaraVeeraMallu, power glance, Pawan Kalyan and Nidhhi Agerwal's Hari Hara Veera Mallu power glance, Happy birthday Pawan Kalyan, Pawan Kalyan, Power Star Pawan Kalyan, Power Star Pawan Kalyan Latest Movies, Pawan Kalyan Upcoming Movies, Power Star Pawan Kalyan Hari Hara Veera Mallu, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు.ఇక పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇప్పటికే స్పెషల్ షోస్ నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. జల్సా ఇంకా తమ్ముడు సినిమాల స్పెషల్ షోలను నిర్వహించనున్నారు. ఇక అలానే మరోవైపు పవన్ సినిమాల నుండి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుండి అప్ డేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొగలుల కాలం నాటి పీరియాడిక్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేసి మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉండగా ముందు నుండి పవన్ బర్త్ డే కు గ్లింప్స్ వస్తుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో మేకర్స్ కూడా సర్ ప్రైజ్ ట్రీట్ ఇస్తున్నారు. ఈసినిమా నుండి పవర్ గ్లాన్స్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం అంటూ ఈసినిమా పవర్ గ్లాన్స్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + three =