
ట్యాగ్ · 19 కథనాలు


4వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా కొత్త సినిమా
బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ చూసినవారందరికీ గౌతమ్ సుపరిచితుడే. తన బిహేవియర్ తో ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ కు రాకముందు గౌతమ్ పలు షార్ట్ ఫిలింస్ లలో నటించిన సంగతి తెలిసిందే కదా. అయితే వాటి ద్వారా గౌతమ్ కు అంత గుర్తింపు రాలేదనే చెప్పొచ్చు. ఇక ఈసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు.

బిగ్ బాస్ 7 హౌస్ లో దొంగలు- కెప్టెన్సీ పోరు
బిగ్ బాస్ సీజన్ 7 అయిదో వారంలో పవరాస్త్ర కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్ దగ్గర ఉన్న పవరాస్త్రలు కూడా బిగ్ బాస్ తిరిగి ఇచ్చేయమనడంతో వీరు ముగ్గురు కూడా పోటీలో పాల్గొనాల్సి వచ్చింది. ఇక ఈ వారం పవరాస్త్ర పోటీలో భాగంగా మొదటి టాస్క్ గా స్మైల్ ప్లీజ్ అనే టాస్క్ ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ జంటలుగా విడిపోయి పోటీ పడ్డారు. కానీ టాస్క్ మాత్రం ఎవరూ పర్ఫెక్ట్ గా ఆడకపోవడంతో సంచాలకులుగా ఉన్న శోభా శెట్టి ఇంకా ప్రిన్స్ చాలా సేపు చర్చలు జరిపి ఫైనల్ గా మొదటిస్థానం గౌతమ్-శోభ శ్రీకి సెకండ్ ప్లేస్ అమర్-సందీప్ కు థర్డ్ ప్లేస్ శివాజీ-ప్రశాంత్ కు నాలుగో ప్లేస్…

గజిబిజిగా స్మైలీ టాస్క్-కన్ఫ్యూజన్ లో కంటెస్టెంట్స్
బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగు వారాలు పూర్తయిపోయి అయిదో వారంలోకి అడుగుపెట్టింది. నాలుగు వారాల్లో 14 మంది కంటెస్టెంట్స్ లో నలుగురు ఎలిమినేట్ అవ్వగా.. నాలుగు వారల్లో నలుగురు పవరాస్త్ర ను గెలుచుకున్నారు. అయితే వీకెండ్ ఎపిసోడ్ లో శివాజీకి అనర్హుడని చెప్పడంతో పవరాస్త్ర కోల్పోయాడు. దీంతో సందీప్, శోభాశెట్టి, ప్రశాంత్ లకు మాత్రమే పవరాస్త్ర ఉంది. ఇక 5వ వారంలో నామినేషన్స్ ప్రక్రియ జరిగిపోయింది. గొడవలు, అరుపులతో ఫుల్ వేడిగా నామినేషన్స్ జరగగా.. పవరాస్త్ర ఉన్నవారు మినహాయించి తేజ, ప్రియాంక, శివాజీ, శుభశ్రీ, అమర్ దీప్, ప్రిన్స్, గౌతమ్ అందరూ నామినేషన్ లోకి వచ్చారు.

బిగ్ బాస్ 7- ఫుల్ ఫైర్ లో 5వారం నామినేషన్స్
బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగు వారాలు అంటే అప్పుడే ఒక నెల పూర్తయిపోయింది. మొత్తం 14మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా మూడో వారం దామిని, నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఐదో వారం మొదలైపోయింది. మరి మండే అంటే నామినేషన్స్ ఉంటాయి.. అప్పుడే హౌస్ లో నామినేషన్స్ వేడి మొదలైపోయింది.

4వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?
బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎట్టకేలకు మొదలైపోయింది. చూస్తుండగానే మూడు వారాలు పూర్తిచేసుకొని నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. ఇక నాలుగో వారంలో నామినేేషన్స్ కూడా చాలా వేడిగా జరిగాయి. హౌస్ మేట్స్ గొడవలతో హౌస్ మొత్తం ఫుల్ వేడెక్కిపోయింది. గౌతమ్ వర్సెస్ ప్రిన్స్, అమర్ దీప్ వర్సెస్ ప్రశాంత్, అమర్ దీప్ వర్సెస్ శుభశ్రీ, ప్రశాంత్ వర్సెస్ రతిక, గౌతమ్ వర్సెస్ శివాజీ ఇలా గొడవలతో హౌరెత్తిపోయి ఆడియన్స్ కు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు. ఫైనల్ గా నాలుగో వారంలో తేజ, గౌతమ్, శుభశ్రీ, రతిక, ప్రియాంక, ప్రిన్స్ నామినేషన్ లోకి వచ్చారు. ఈ నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అయి ఇంటికి…

బిగ్ బాస్ 7-గొడవలతో దద్దరిల్లిన హౌస్
బిగ్ బాస్ సీజన్ 7 మొదలై అప్పుడే మూడు వారాలు కూడా పూర్తిచేసుకొని నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఎప్పటిలాగే ఈవారం నామినేషన్స్ కూడా ఫుల్ ఫైర్ మీద మొదలయ్యాయి. సందీప్, శివాజీ, సందీప్ లను జ్యూరీ సభ్యులుగా పెట్టి.. నామినేట్ చేయాలనుకునే వారు ఇద్దరు వ్యక్తులను ఎంచుకొని వారిని బోనులలో పెట్టి తగిన కారణాలు చెప్పాల్సి ఉండగా.. జ్యూరీ సభ్యులు ఎవరి నామినేషన్ ను ఏకాభిప్రాయంతో ఒప్పుకుంటారో ఆ కంటెస్టెంట్ ను గిల్ట్ బోర్డ్ పై పెట్టాలి. ఇదీ నామినేషన్ ప్రక్రియ.

బిగ్ బాస్ 7- ఫుల్ ఫైర్ తో 4వ వారం నామినేషన్ ప్రక్రియ
బిగ్ బాస్ 7 లో మూడు వారాలు పూర్తయిపోయి నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈసారి వీకెండ్స్ కూడా చాలా వేడి వేడిగా ఉండబోతున్నట్టు కనిపిస్తున్నాయి. సండే ఫండే కాకుండా మండే ఎపిసోడ్ లా డిజైన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే సండే ఎపిసోడ్ లో ఒకరి మీది ఒకరి అభిప్రాయాలు తెలియచేయగా ఆ వేడితోనే సండే ఎపిసోడ్ కూడా మొదలైపోయింది. ఎపిసోడ్ లో భాగంగా రతిక, ప్రశాంత్ గురించి నాగార్జున అడిగినప్పుడు శివాజీ రెండు చేతులు కలిస్తేనే ఏదైనా అవుతుంది అని చెప్పడంతో దాని గురించి శివాజీతో డిస్కషన్ పెడుతుంది రతిక. ఇద్దరూ కాసేపు వాదించుకున్న తర్వాత శివాజీ సారి చెప్పాను ఇంకా కాళ్లు పట్టుకోవాలా.. కావాలనే ల్యాగ్ చేస్తున్నావనిపిస్తుంది…

బిగ్ బాస్ 7.. కలర్ కోడ్ లో కంటెస్టెంట్ల ట్రూ కలర్స్
బిగ్ బాస్ సీజన్ 7 లో సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు పూర్తయిపోయాయి. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా హౌస్ నుండి బయటకు వెళ్లగా.. మూడో వారం దామిని ఎలిమినేట్ అయింది. మూడో వారంలో దామిని, శుభశ్రీ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్ నామినేషన్స్ లోకి రాాగా అతి తక్కువ ఓటింగ్ రావడంతో దామిని ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ 7- శోభా ను ఏడిపించిన బిగ్ బాస్, అమర్ కు గుండు
బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి ఉల్టా పల్టా అంటూ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ నడిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రెండు వారాలు పూర్తయిపోయి మూడో వారం కూడా మరో రెండు రోజుల్లో పూర్తి చేసుకోబోతుంది. ప్రస్తుతం అయితే మూడో వారం పవరాస్త్ర కోసం హోస్ లో పోటీ జరుగుతుంది. ముందు ప్రిన్స్, అమర్ దీప్, శోభాశెట్టిని పవరాస్త్ర కంటెండర్లుగా ఎంపిక చేసి వారి ముగ్గురిలో ఎవరు అనర్హులో తెలపాలని హౌస్ మేట్లను ఆదేశిస్తున్నాడు బిగ్ బాస్.

బిగ్ బాస్7.. ప్రిన్స్ కు చుక్కలు చూపించిన కంటెస్టెంట్స్
మూడో వారం రెండు రోజులు నామినేషన్స్ తో హౌస్ వేడక్కిపోయింది. మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో కూడా రచ్చ రచ్చ చేశారు హౌస్ మేట్స్. ఇకపోతే మూడో వారం పవరాస్త్ర కోసం అమర్దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్లను బిగ్ బాస్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీరి ముగ్గురిలో ఎవరు అర్హులో కన్ఫెషన్ రూమ్ కి వచ్చి తమ కారణాలు చెప్పాలంటూ బిగ్ బాస్ ఆదేశించగా. అందులో శోభా శెట్టి పేరును పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ చెప్పగా.. ప్రిన్స్ యావర్ పేరును రతికా రోజ్, దామిని, తేజలు చెప్పారు. ప్రియాంక జైన్.. అమర్ దీప్, శోభా శెట్టి ఇద్దరి పేర్లు చెప్పింది.

బిగ్ బాస్ 7- 3వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 7 మొదలైపోయింది. మొదలవ్వడమే కాదు అప్పుడే రెండు వారాలు కూడా పూర్తయిపోయాయి. ఇక మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. ఇక చూస్తుండగానే మూడో వారంలోకి అడుగుపెట్టేశారు హౌస్ మేట్స్. మూడో వారం నామినేషన్స్ కూడా చాలా వేడిగా జరిగాయి. ఇంటిలో ఉండటానికి ఎవరు అనర్హులో చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పగా కంటెస్టెంట్స్ ఎవరికి తోచిన రీజన్స్ వారు చెప్పి నామినేట్ చేశారు. ఈ ప్రక్రియలో ప్రియాంక ప్రిన్స్, యావర్ ను ప్రశాంత్.. తేజ, దామిని ని శోభాశెట్టి.. శుభ శ్రీ, రతికని అమర్ దీప్.. గౌతమ్, శుభ శ్రీ ని నామినేట్…

బిగ్ బాస్7- బఫూన్స్ అంటూ రెచ్చిపోయిన రతిక.. హౌస్ మేట్స్ ఆగ్రహం
హౌస్ లో రెండు రోజుల నుండి పవరాస్త్ర కోసం టాస్క్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. పవరాస్త్రలో భాగంగా మాయస్త్ర అనే టాస్క్ ను ఇచ్చాడ. అందులో పలు టాస్క్ లు ఇచ్చి ఆ టాస్కుల్లో గెలిచిన టీమ్ ఫైనల్ గా వపరాస్త్రను గెలుచుకునే పోటీ ఉంటుంది. ఈనేపథ్యంలోనే రణధీర, మహాబలి అంటూ రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ ను డివైడ్ చేసి పుల్ రాజా పుల్, మలుపులో ఉంది గెలుపు అనే టాస్క్ లు ఇవ్వగా.. రెండు టాస్కుల్లో రణధీర టీమ్ గెలవడంతో ఆటీమ్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్ లు పవరాస్త్ర పోటీకి ఎన్నికయ్యారు.

బిగ్ బాస్7- కన్ఫ్యూజన్ గేమ్ తో శివాజీ చెక్.. సందీప్ ఫైర్
ఈసారి ఉల్టా పల్టా అంటూ మొదలైన సీజన్ 7 లో తొమ్మిది రోజులు గడిచిపోయి పదో రోజులోకి అడుగుపెట్టింది. కంటెస్టెంట్ లో పర్మినెంట్ ఇంటి సభ్యులు అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తూ వస్తున్నాడు. గత వారం సందీప్ పవరాస్త్రను గెలుచుకొని ఇంటిసభ్యుడు అయ్యాడు. ప్రస్తుతం రెండో వారంలో పవరాస్త్రకోసం పోటీ నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్

బిగ్ బాస్ 7-మహాబలి వర్సెస్ రణధీర
నిన్న నామినేషన్ ప్రక్రియ చాలా వేడిగా ప్రారంభమైంది. ఒక కంటెస్టెంట్ వచ్చి నిలబడితే ఆ కంటెస్టెంట్ ను ఎంత మంది అయినా నామినేట్ చేసుకోవచ్చనే బంపరాఫర్ ను బిగ్ బాస్ ఇవ్వడంతో ఇదే ఛాన్స్ దొరకడంతో హౌస్ మేట్స్ ఎవరి మీద కోపంతో ఉన్నారో వారందరినీ నామినేట్ చేసేస్తున్నారు.

బిగ్ బాస్ 7- రైతుబిడ్డపై హౌస్ మేట్స్ ఫైర్
మొత్తానికి బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ అయిపోయింది. గత వారం 8మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లోకి రాగా అందులో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. గత రెండో వారం మొదలైపోయింది. మరి వారం రోజులు ఎలా ఉన్నా.. సోమవారం అంటే బిగ్ బాస్ ఆడియన్స్ కు పండగ. ఎందుకంటే ఆరోజే నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది. ఇక ఆరోజే కంటెస్టెంట్స్ లో ఉండే ట్రూ కలర్స్ బయటపడుతుంటాయి కాబట్టి.

బిగ్ బాస్ 7- ఇమ్యూనిటీకి ఎవరు అర్హులు?
బిగ్ బాస్ హౌస్ లో నాలుగు రోజులు పూర్తిచేసుకొని ఐదో రోజులోకి అడుగుపెట్టారు. కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ ఇచ్చేందుకు బిగ్ బాస్ వరుసగా టాస్క్ లు ఇస్తూ వస్తున్నాడు. ముందు రోజు ఫేస్ ది బీస్ట్ పెట్టగా.. నిన్న బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఫేస్ ది బీస్ట్ టాస్క్ లో ప్రియాంక, సందీప్ గెలిస్తే బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేసే టాస్క్ లో శివాజీ అలానే రతిక సక్సెస్ అయ్యారు. ఇక ఈరోజు మరో టాస్క్ తో వచ్చేశాడు.. మొదట దామినిని అలానే కిరణ్ ను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ వారిద్దరికీ కోడిగుడ్లు ఇచ్చి చేరో గుడ్లను కంటెస్టెంట్ల తలపై కొట్టి వాటితో ఆమ్లేట్ వేయమని చెబుతాడు. ఇద్దరూ ఎవరి ప్రయత్నం వారు చేసి…

బిగ్ బాస్ సీజన్ 7- బిగ్ బాస్ పై శివాజీ ఫైర్
రెండు రోజులు నామినేషన్స్, మూడో రోజు ఫేస్ ది బీస్ట్ అంటూ మొదటి టాస్క్ తో మూడు రోజులు ముగిశాయి. ఇక నాలుగో రోజు మొదలైపోయింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగే హౌస్ మేట్స్ ఫుడ్ కోరికలను చూపించాడు బిగ్ బాస్. లాన్ లో పొడుకొని ఉన్న దామిని ఈ టైమ్ లో ఛాయ్, బిస్కట్ ఉంటే ఎంత బావుంటుందో అంటూ మాట్లాడుకుంటుంది.

బిగ్ బాస్ 7- ఫేస్ ది బీస్ట్, కంటెస్టెంట్ ల కుస్తీలు
ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ బిగ్ బాస్ హోస్ లో మూడో రోజు మొదలైపోయింది. రెండు రోజులు నామినేషన్స్ తో వేడెక్కిన హోస్ మూడో రోజు కాస్త కూల్ గా మొదలైంది. కింగ్ విషయంలో ప్రిన్స్ కు అలానే షకీలాకు కాస్త మనస్పర్థలు రాగా ఇద్దరూ మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. ఇక హౌస్ అంతా సైలెంట్ గా ఉన్న సమయంలో మొదటి వారం మొదటి టాస్క్ తో వచ్చేశాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం.. కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?
తెలుగునాట 'బిగ్ బాస్' రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర వీక్షకుల్లో ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకూ ఈ షో తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్బాస్ ఏడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్గా మొదలైన ఈ కార్యక్రమంలో హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లను హౌస్లోకి ఆహ్వానించారు. నాగ్ గత కొన్ని రోజులుగా 'ఉల్టా పుల్టా' అంటూ ఈ సీజన్ ప్రోమోతోనే ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే.