బిగ్ బాస్ 7- 3వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?

who do you think will be eliminated from bigg boss season 7 in the 3rd week

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 7 మొదలైపోయింది. మొదలవ్వడమే కాదు అప్పుడే రెండు వారాలు కూడా పూర్తయిపోయాయి. ఇక మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. ఇక చూస్తుండగానే మూడో వారంలోకి అడుగుపెట్టేశారు హౌస్ మేట్స్. మూడో వారం నామినేషన్స్ కూడా చాలా వేడిగా జరిగాయి. ఇంటిలో ఉండటానికి ఎవరు అనర్హులో చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పగా కంటెస్టెంట్స్ ఎవరికి తోచిన రీజన్స్ వారు చెప్పి నామినేట్ చేశారు. ఈ ప్రక్రియలో ప్రియాంక ప్రిన్స్, యావర్ ను ప్రశాంత్.. తేజ, దామిని ని శోభాశెట్టి.. శుభ శ్రీ, రతికని అమర్ దీప్.. గౌతమ్, శుభ శ్రీ ని నామినేట్ చేశాడు. రతిక.. శుభ శ్రీ, గౌతమ్ ను అలానే తేజ.. ప్రశాంత్, గౌతమ్ ను ప్రిన్స్ యావర్.. ప్రియాంక, దామినిని దామిని ప్రిన్స్ యావర్, శుభశ్రీ ని గౌతమ్.. రతిక, అమర్ దీప్ ను శుభ శ్రీ.. తేజ, ప్రియాంక ను నామినేట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. నామినేట్ అయిన వారి నుండి ఒకరిని సేవ్ చేస్తూ నామినేట్ అవ్వని వారిని స్వాప్ చేయమని పవరాస్త్రను గెలుచుకున్న సందీప్ ను అలానే శివాజీని కోరతాడు. ఇక సందీప్, శివాజీ డిస్కస్ చేసి అమర్ దీప్ ను నామినేట్ చేస్తూ తేజను సేవ్ చేశారు. దీంతో అమర్ దీప్ కాస్త అసహనానికి గురవుతాడు. ఫైనల్ గా అమర్ దీప్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతిక, గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ, దామిని నామినేషన్స్ లోకి వచ్చారు.

మరి వీరిలో ఈవారం ఎవరు సేవ్ అవుతారని అనుకుంటున్నారు.. ఎవరు ఎలిమినేట్ అయి ఇంటి దారి పడతారో మీ ఓటు ద్వారా తెలియచేయండి..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =