బిగ్ బాస్7.. ప్రిన్స్ కు చుక్కలు చూపించిన కంటెస్టెంట్స్

bigg boss telugu season 7 17th day highlights

మూడో వారం రెండు రోజులు నామినేషన్స్ తో హౌస్ వేడక్కిపోయింది. మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో కూడా రచ్చ రచ్చ చేశారు హౌస్ మేట్స్. ఇకపోతే మూడో వారం పవరాస్త్ర కోసం అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను బిగ్ బాస్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీరి ముగ్గురిలో ఎవరు అర్హులో కన్ఫెషన్ రూమ్ కి వచ్చి తమ కారణాలు చెప్పాలంటూ బిగ్ బాస్ ఆదేశించగా. అందులో శోభా శెట్టి పేరును పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ చెప్పగా.. ప్రిన్స్ యావర్ పేరును రతికా రోజ్, దామిని, తేజలు చెప్పారు. ప్రియాంక జైన్.. అమర్ దీప్, శోభా శెట్టి ఇద్దరి పేర్లు చెప్పింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే ఎన్నికైన కంటెండర్లకు ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వారు తాము అర్హులమని నిరూపించుకోవాలి. టాస్క్ ఏంటంటే కంటెండర్ తన తలను ఒక బల్లపై ఉంచితే వారిని అనర్హులను చెప్పిన వారు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. గంట సేపు వాటిని తట్టుకొని నిలిచిన వారే గెలుస్తారు. ఇక ఈ టాస్క్ లో ముందుగా ప్రిన్స్ వస్తాడు. ప్రిన్స్ ను అనర్హుడని చెప్పిన దామిని, రతిక, తేజ తనను నానా రకాలుగా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారు. నీళ్లు, గుడ్లు, షాంపు, గడ్డి, పేడ ఇలా అన్ని వాడేసి ప్రిన్స్ ను డిస్టర్బ్ చేస్తారు. అయితే ప్రిన్స్ వాటన్నింటిని తట్టుకొని నిలబడతాడు.

ఇక ప్రిన్స్ టాస్క్ అయిపోయిన తరువాత శోభా శెట్టి పేరును చెప్పిన వాళ్ల వీడియో చూపిస్తాడు బిగ్ బాస్. శోభా శెట్టి పేరున శుభశ్రీ, ప్రశాంత్, గౌతమ్ చెప్పగా ఇక్కడ రచ్చ మొదలైంది. తాను ఫిజికల్ వీక్ అని చెప్పిన గౌతమ్ తో శోభాశెట్టి గొడవకు దిగింది. నేను వీక్ అయితే పుల్ రాజా పుల్ గేమ్, కుస్తీ పోటీల్లో ఎలా గెలుస్తాను.. నువ్వు చెప్పేవి బక్వాస్ రీజన్స్ అంటూ ఫైర్ అయింది. మరో వైపు గౌతమ్ శోభా తో అసలు నీకు ఈ హౌస్ లో ఉండే అర్హతే లేదు అనగా.. దానికి శోభా నీకంటే ఎక్కువ రోజులు ఉండి చూపిస్తా అంటూ ఛాలెంజ్ విసిరింది. మరోవైపు అమర్ దీప్ ను కూడా ఎవరు అనర్హులు అన్నారో ఆ వీడియో కూడా చూపించగా ఎపిసోడ్ ముగుస్తుంది. మరి నేడు ఏం జరుగుతుందో.. బిగ్ బాస్ పోటీని తట్టుకొని ఎవరు ముందుకు వెళతారో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 2 =