బిగ్ బాస్ 7- ఫుల్ ఫైర్ లో 5వారం నామినేషన్స్

bigg boss season 7 telugu 5 th week nominations highlights

బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగు వారాలు అంటే అప్పుడే ఒక నెల పూర్తయిపోయింది. మొత్తం 14మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా మూడో వారం దామిని, నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఐదో వారం మొదలైపోయింది. మరి మండే అంటే నామినేషన్స్ ఉంటాయి.. అప్పుడే హౌస్ లో నామినేషన్స్ వేడి మొదలైపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే వీకెండ్ ఎపిసోడ్ లో ముగ్గురు ఇంటి సభ్యుల్లో అనర్హులు ఎవరని మిగిలిన హౌస్ మేట్స్ శివాజీ పేరు చెప్పడంతో శివాజీ పవరాస్త్రను కోల్పోతాడు. దీంతో శివాజీ కూడా నామినేషన్స్ లో ఉంటాడు. ఇక సందీప్, శోభా కు పవరాస్త్ర ఉండగా.. నాలుగో వారం పల్లవి ప్రశాంత్ కు పవరాస్త్ర రావడంతో ఇంటిసభ్యుడయ్యాడు. ఇక సోమవారం ఏపిసోడ్ మొదలైపోయింది. గతంలో చూసిన నామినేషనే ప్రక్రియనే ఇప్పుడు నిర్వహించారు. ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని ఎంచుకుని.. సరైన కారణాలతో నామినేట్ చేయాలి. నామినేట్ చేయాలనుకున్న వారి మెడలో ఉన్న షీటుపై కత్తితో పొడవాల్సి ఉంటుంది.

ఆ తరువాత వచ్చిన ప్రియాంక శివాజీని నామినేట్ చేస్తూ మేము బయట మాడ్లాడుకొని వచ్చామని అన్నారు ఎవరు సార్ అని అడుగగా.. దానికి శివాజీ నేను మీపేర్లు చెప్పలేదు కదా అని అనగా దానికి ప్రియాంక మీరు పేర్లు చెప్పడంలేదంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారని అంది. రెండో నామినేషన్ ప్రిన్స్ ను వేస్తూ.. ఫుడ్ విషయంలో కాస్త చూసుకోమని.. గేమ్ లో నాతో, శోభా శెట్టి తో ఉన్న బిహేవియర్ శోభాశ్రీతో లేదని తెలిపింది. గౌతమ్ వచ్చి ముందు సెల్ఫ్ నామినేట్ చేయాలనుకుంటాడు.. అయితే అది కుదరకపోవడంతో అమర్ ని నామినేట్ చేస్తూ.. ఓడిపోయిన ప్రతిసారీ వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావు.. ఓటమిని తీసుకోలేకపోతున్నావు అంటూ కారణం చెప్పాడు. ఆ తరువాత శివాజీని నామినేట్ చేస్తూ తేజ నన్ను కొడుతున్నప్పుడు మీరు ఆపాల్సింది అంటూ నామినేట్ చేస్తాడు. దానికి శివాజీ నాది తప్పు అయితే నన్ను ఎలిమినేట్ చేయండి.. లేకపోతే గౌతమ్ ను ఎలిమినేట్ చేయండి అంటూ వాదించాడు.

అనంతరం శుభశ్రీ వచ్చి అమర్ దీప్ ను నామినేట్ చేస్తూ గాలా విషయంలో నేను గెలిచి నువ్వు ఓడిపోయినందుకు హర్ట్ అయ్యావు అంటూ రీజన్ చెబుతుంది. ఇక ప్రియాంకను నామినేట్ చెబుతూ.. లాస్ట్ వీక్ సరిగ్గా ఆడలేదని.. నువ్వు గ్రూప్ గా ఉంటున్నావని చెప్పి నామినేట్ చేస్తుంది. ప్రిన్స్ వచ్చి మొదటగా అమర్ ను ఆ తరువాత ప్రియాంక ను నామినేట్ చేశాడు. ఆ తరువాత వచ్చిన అమర్ శుభశ్రీని నామినేట్ చేస్తూ నువ్వు గెలిచినందుకు నేనేమి ఫీలవ్వలేదు.. నువ్వు గెలిచిన హ్యాపీలో ఉంటావు.. నేనే ఓడిపోయిన బాధలో ఉంటాను అని తెలిపాడు. రెండో నామినేషన్ శివాజీని వేస్తాడు. తేజ వచ్చి నువ్వు చేసింది నీకే తప్పనిపించినప్పుడు .. నిన్ను నువ్వు నామినేట్ చేసుకోలేవు కాబట్టి నేను చేస్తున్నా అంటూ మొదటిగా గౌతమ్ ను నామినేట్ టేస్తాడు. ఆ తరువాత ఫుడ్ ను విసిరేయడం నచ్చలేదని ప్రిన్స్ ను నామినేట్ చేస్తాడు. ప్రిన్స్ యావర్ వచ్చి అమర్ దీప్ ను అలానే ప్రియాంకను నామినేట్ చేశాడు. దీంతో ఫైనల్ గా అందరూ నామినేషలోకి వచ్చారు. తేజ, ప్రియాంక, శివాజీ, శుభశ్రీ, అమర్ దీప్, ప్రిన్స్, గౌతమ్ అందరూ నామినేషన్ లోకి వచ్చారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fifteen =