బిగ్ బాస్ హౌస్ లో నాలుగు రోజులు పూర్తిచేసుకొని ఐదో రోజులోకి అడుగుపెట్టారు. కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ ఇచ్చేందుకు బిగ్ బాస్ వరుసగా టాస్క్ లు ఇస్తూ వస్తున్నాడు. ముందు రోజు ఫేస్ ది బీస్ట్ పెట్టగా.. నిన్న బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఫేస్ ది బీస్ట్ టాస్క్ లో ప్రియాంక, సందీప్ గెలిస్తే బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేసే టాస్క్ లో శివాజీ అలానే రతిక సక్సెస్ అయ్యారు. ఇక ఈరోజు మరో టాస్క్ తో వచ్చేశాడు.. మొదట దామినిని అలానే కిరణ్ ను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ వారిద్దరికీ కోడిగుడ్లు ఇచ్చి చేరో గుడ్లను కంటెస్టెంట్ల తలపై కొట్టి వాటితో ఆమ్లేట్ వేయమని చెబుతాడు. ఇద్దరూ ఎవరి ప్రయత్నం వారు చేసి ఆమ్లేట్లు వేస్తారు కానీ డిస్ క్వాలిఫై అయిపోతారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రతికకు అలానే శివాజీకి మరో టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్.. ఇద్దరిలో ఎవరు ఎక్కువసేపు బాత్ రూమ్ లో ఉంటే వారికి ఇమ్యూనిటీ వస్తుంది. ఇక ఈటాస్క్ లో ఇద్దరూ విన్ అవుతారు. ఇక సందీప్, ప్రియాంక, శివాజీ, రతిక ఈ నలుగురిలో ఏ ఇద్దరూ అనర్హులో చెప్పి నామినేట్ చేయాల్సిందిగా మిగిలిన హౌజ్ మేట్లకు ఆదేశమిచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్కులో అధికంగా రతిక, శివాజీలు నామినేట్ అయ్యారు. రతికను.. సుభశ్రీ, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్, శోభా శెట్టి, తేజ నామినేట్ అయ్యారు. శివాజీని అమర్ దీప్, గౌతమ్ నామినేట్ చేశారు. ప్రియాంకను ప్రశాంత్, సందీప్ ను ప్రిన్స్ నామినేట్ చేశారు. దీంతో ఇమ్యునిటీ టాస్క్ ఫైనల్‍లోకి ఆట సందీప్, ప్రియాంక్ జైన్ వెళ్లారు.
శివాజీ డెరెక్షన్.. షకీలా యాక్షన్
టాస్క్ పూర్తయిన తరువాత షకీలా మరో స్కిట్ కు తెరతీసింది. శివాజీ డైరెక్షన్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించింది. మొదట తనకి హెల్త్ బాలేనట్టుగా నటించింది. ఆ తరువాత ఫీవర్ వచ్చి అలసిపోయినట్టు జీవించేసింది. ఆ తరువాత తేజను భయపెట్టాలని ఫిక్స్ అయిన షకీలా పానికి అటాక్ వచ్చినట్టు నటించింది. నిద్రలో నుంచి లేచి.. సీరియస్‌గా ఫేస్ పెట్టి.. లేచి కూర్చుని కళ్లు పెద్ద పెద్దగా చేసింది. మిగిలిన హోస్ మేట్స్ కూడా ఏ జరిగిందని కంగారు పడటమే కాదు షకీలా దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడిపోతుంటారు. కొంతసేపటికి తాను కావాలనే ఇలా చేశానని, తేజ ను భయపెట్టడానికే ఇలా చేశానని తెలిపింది.
మరి ఫైనల్ గా ఇమ్మూనిటీ టాస్క్ లో సందీప్, ఇంకా ప్రియాంక మిగులుతారు. వీరిద్దరిలో ఐదువారాల ఇమ్యూనిటీ ఎవరికి వస్తుందో.. బిగ్ బాస్ ఫైనల్ గా ఏ టాస్క్ ఇస్తాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.