బిగ్ బాస్ 7- రైతుబిడ్డపై హౌస్ మేట్స్ ఫైర్

bigg boss telugu season 7 day 8 highlights

మొత్తానికి బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ అయిపోయింది. గత వారం 8మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లోకి రాగా అందులో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. గత రెండో వారం మొదలైపోయింది. మరి వారం రోజులు ఎలా ఉన్నా.. సోమవారం అంటే బిగ్ బాస్ ఆడియన్స్ కు పండగ. ఎందుకంటే ఆరోజే నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది. ఇక ఆరోజే కంటెస్టెంట్స్ లో ఉండే ట్రూ కలర్స్ బయటపడుతుంటాయి కాబట్టి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎనిమిదో రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ప్రియాంక, అమర్ దీప్, శోభాశెట్టి శివాజీపై ఫైర్ అవుతుంటారు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటూ చెబుతున్నాడని.. తను కూడా పల్లవి ప్రశాంత్, రతికను సపోర్ట్ చేస్తూ తాను ఆడేది కూడా గ్రూప్ గేమే అంటూ వాపోతుంటారు. మరోవైపు విఐపీ బెడ్ గురించి రతిక ఇంకా తేజ మధ్య కూడా పెద్ద గొడవే జరిగింది.

నామినేషన్స్

ఆ తరువాత అందరూ ఎదురుచూసిన నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఉన్న పదమూడు మంది కంటెస్టెంట్స్ లో పవరాస్త్ర సాధించిన సందీప్ నామినేషన్ ప్రక్రియ నుండి తప్పుకున్నాడు. ఉల్టా పుల్టా అన్నట్టుగా నామినేషన్ ప్రక్రియ కూడా ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడు బిగ్ బాస్. దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలని తెలిపాడు బిగ్ బాస్. దానితో పాటు ఒక వ్యక్తి వచ్చి నిలబడితే అతడిని ఎంతమంది నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్లు వచ్చి అతడి పై బజర్ నొక్కి రంగు నీళ్లు పోయాలి అని తెలిపాడు. ఇందులో సందీప్ ప్రిన్స్ ను నాామినేట్ చేశాడు. నాగార్జున గారు తక్కువ స్కోర్ ఇచ్చారని.. అందుకే నామినేట్ చేస్తున్నానని తెలిపాడు. దానికి ప్రిన్స్ కూడా నా కంటే తక్కువ స్కోర్ ఇచ్చిన వారు ఉన్నారని.. మీరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని అన్నారు.

ఇక ముందుగా టెస్టీ తేజాను నామినేట్ చేయాలని బిగ్ బాస్ కోరాగ.. రతిక, పల్లవి ప్రశాంత్, శుభ శ్రీ ముగ్గురు నామినేట్ చేశారు. ఆ తర్వాత దామిని ని నామినేట్ చేయమని చెప్పగా లక్కీ గా దామినిని ఎవరూ నామినేట్ చేయలేదు. అనంతరం శివాజీ రాగా ముందునుండీ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని శివాజీపై ఫైర్ అవుతున్నారు కాబట్టి ప్రియాంక, అమర్ దీప్, శోభా శెట్టి, షకీలా, దామిని శివాజీని నామినేట్ చేశారు. ఈ నామినేషన్ లో ముఖ్యంగా ప్రియాంక, శివాజీ మధ్య గట్టిగానే వాదన జరిగింది. ప్రియాంక రాగానే నువ్వు కంప్లీట్ చేయలేవ్‌లే కానీ..పో.. పో అంటూ శివాజీ అనగా దానికి ఏంటి పో.. నువ్వు ఎవరు పో అనడానికి.. రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు రెస్పెక్ట్ తీసుకోండి అంటూ ఫైర్ అయ్యింది.

ప్రశాంత్ పై ఫైర్

ఇదిలా ఉంటే ప్రశాంత్ పై ఉన్న కోపాన్ని ఒక్కసారిగా ఈ నామినేషన్ లో చూపించారు హౌస్ మేట్స్. ఏకంగా ఆరుగురు నామినేట్ చేశారు. గౌతమ్, అమర్ దీప్, షకీలా, దామిని, తేజ, ప్రియాంక నామినేట్ చేశారు. ముఖ్యంగా రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ పై అందరూ విరుచుకుపడ్డారు. అందరూ రైతుబిడ్డలే అని, సింపథీ గేమ్స్ వద్దంటూ ఫైర్ అయ్యారు. అన్నీ ఒక ఒకటైతే ఇన్ని రోజులు క్లోజ్ గా ఉన్న రతిక కూడా ప్రశాంత్ కు కౌంటర్ ఇవ్వడం విశేషం. ఇక ముందు కాస్త యాటిట్యూట్ చూపించిన ప్రశాంత్ ఆ తరువాత హౌస్ మేట్స్ తో బాగానే వాదించాడు.. అయితే అంతమంది నామినేట్ చేయడంతో ఏడ్చేశాడు. నేను కూడా డిగ్రీ వరకు చదివాను.. ఎవరి కింద పని చేయడం ఇష్టం లేక.. పొలం పనులు చేస్తున్నా..యాక్టింగ్ అంటే ఇష్టంతో కుక్కలాగా స్టూడియో చుట్టూ తిరిగానని ప్రశాంత్ అనగా.. కుక్కలాగా స్టూడియో చుట్టూ.. తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నావని రతిక ప్రశ్నించింది.

మొత్తానికి ప్రశాంత్ నామినేషన్స్ తో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మరి మిగిలిన ప్రాసెస్ నేడు జరగనుంది. మరి ఈరోజు ఎంత ఫైర్ ఉండబోతుందో.. ఎవరు గొడవలు పడతారో తెలియాలంటే నేటి ఎపిపోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here