బిగ్ బాస్ 7-గొడవలతో దద్దరిల్లిన హౌస్

bigg boss 7 telugu day 23 highlights

బిగ్ బాస్ సీజన్ 7 మొదలై అప్పుడే మూడు వారాలు కూడా పూర్తిచేసుకొని నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఎప్పటిలాగే ఈవారం నామినేషన్స్ కూడా ఫుల్ ఫైర్ మీద మొదలయ్యాయి. సందీప్, శివాజీ, సందీప్ లను జ్యూరీ సభ్యులుగా పెట్టి.. నామినేట్ చేయాలనుకునే వారు ఇద్దరు వ్యక్తులను ఎంచుకొని వారిని బోనులలో పెట్టి తగిన కారణాలు చెప్పాల్సి ఉండగా.. జ్యూరీ సభ్యులు ఎవరి నామినేషన్ ను ఏకాభిప్రాయంతో ఒప్పుకుంటారో ఆ కంటెస్టెంట్ ను గిల్ట్ బోర్డ్ పై పెట్టాలి. ఇదీ నామినేషన్ ప్రక్రియ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ప్రక్రియలో మొదటగా వచ్చిన ప్రిన్స్ యావర్ ప్రియాంకను అలానే తేజను నామినేట్ చేయగా.. వారిద్దరిలోప్రియాంకను ఎంపిక చేస్తారు జ్యూరీ సభ్యూలు. ఆ తరువాత వచ్చిన శుభశ్రీ, అమర్ దీప్ లను నామినేట్ చేయగా.. రతిక-అమర్ దీప్ లలో జ్యూరీ సభ్యులు రతికను నామినేట్ చేస్తారు. దీంతో రతిక గిల్ట్ బోర్డ్ ఎక్కుతుంది. అనంతరం గౌతమ్ వచ్చి ప్రిన్స్ ను అలానే తేజను నామినేట్ చేశాడు. వీరిద్దరి గొడవతో ముగిసిన ఎపిసోడ్ మళ్లీ అక్కడినుండే మొదలవుతుంది. హౌస్ లో ప్రిన్స్ బిహేవియర్ బాలేదని.. అతని యారొగెన్సీ వల్ల హౌస్ మేట్స్ ఇబ్బందిపడుతున్నారని.. అతని యాటిట్యూట్ కరెక్ట్ కాదంటూ చెప్పాడు. ఇక్కడ ఇద్దరి మధ్య గొడవ పెరిగిపోవడంతో జడ్జిలుగా ఉన్న శివాజీ, సందీప్ కోప్పడి ప్రిన్స్ ను తన ప్లేస్ కు వెళ్లమని చెప్పారు.

మరోవైపు శివాజీ కలుగచేసుకొని ఇవే మాటలు నాగార్జున గారిని అడగాల్సింది అని అనగా నాది కోపం కాదు బాధ అంటూ తెలుపుతాడు. శోభా ముందు నువ్వు షర్ట్ తీసేశావ్ అది ఏంటీ అని శివాజీ గౌతమ్ ను అడుగగా దానికి గౌతమ్ మీరు లాయర్ లా బిహేవ్ చేస్తున్నారు.. జడ్జిలా బిహేవ్ చేయడం లేదు అంటాడు. ఈక్రమంలో ప్రిన్స్ వర్సెస్ గౌతమ్ కాస్త శివాజీ వర్సెస్ గౌతమ్ అయింది. ఫైనల్ గా తేజ, ప్రిన్స్ లలో ప్రిన్స్ ను నామినేట్ చేస్తారు జ్యూరీ సభ్యులు..

ఆ తరువాత వచ్చిన అమర్ దీప్ శుభశ్రీ, ప్రశాంత్ లను నామినేట్ చేస్తూ.. గత వారం తాను ఆడలేకపోయాలని.. ఆ విషయం ఒప్పుకున్న తరువాత కూడా మళ్లీ అదే రీజన్ తో నామినేట్ చేయడం బాలేదని శుభశ్రీ ని నామినేట్ చేస్తాడు. ఇక ప్రశాంత్ గురించి చెబుతూ తనకు రెండు ముఖాలు ఉన్నాయని.. డబల్ ఫేస్ తో ఆడొద్దని అంటాడు. అందుకు ప్రశాంత్ రెండు ముఖాలు అంటే ఎలా ఉంటాయి.. ఇటూఅటూ ఉంటాయా అంటూ కౌంటర్ లు ఇస్తూ మాట్లాడుతుంటాడు. దీంతో అమర్ దీప్ కు ఇంకా కోపం వస్తుంది. వీరిద్దరూ కూడా కాసేపు వాదనకు దిగుతారు. ఫైనల్ గా వీరిద్దరిలో శోభాను గిల్డ్ బోర్డ్ ఎక్కిస్తారు జ్యూరీ సభ్యులు.

ప్రశాంత్ వచ్చి గౌతమ్ ను అమర్ దీప్ ను నామినేట్ చేస్తాడు. శోభా శెట్టితో గొడవ జరిగిన సందర్భంలో నువ్వు చొక్కా విప్పడం నాకు నచ్చలేదంటూ ప్రశాంత్ రీజన్ చెప్పాడు. దీంతో గౌతమ్ కూడా గట్టిగా వాదించాడు. ఇక్కడే రతిక పొట్టి డ్రస్ వేసుకుంటే ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని నవ్వు ఎందుకు అన్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నాడు. దీంతో రతిక ప్రశాంత్ పై ఫైర్ అవుతుంది. నేను ఏ డ్రస్ వేసుకుంటే నీకెందుకురా భయ్ అనగా దానికి ప్రశాంత్ మరి నా ముందుకు వచ్చి ఇలా ఇలా అని ఎందుకు అన్నవ్ అంటూ కౌంటర్ ఇస్తారు. నేను నీ ప్రాపర్టీ అని ఎలా అంటావ్.. నీక్ ఏం రైట్ ఉంది అంటూ రతిక ప్రశాంత్ పై ఫైర్అవుతుంది. దీంతో విసిగిపోయిన ప్రశాంత్ నీకో దండం.. నిన్ను ఇప్పటినుండి రతిక అని పిలవను ఏం పిలవను అక్కా అని పిలుస్తాను అంటూ షాకిస్తాడు. ప్రశాంత్ కు కంటెండర్ షిప్ అవకాశం వస్తే నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను గుండు గీయించుకోలేను అని వదిలేశావ్.. కానీ అమ్మాయి ధైర్యం చేసింది.. అదే నువ్వు ధైర్యం చేయలేదన్నా.. అది నాకు నచ్చలేదు.. అంటూ ప్రశాంత్ చెప్పాడు. ఇక అమర్ దీప్, గౌతమ్ లలో గౌతమ్ ను గిల్ట్ బోర్డ్ ఎక్కిస్తారు. దీంతో నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

అయితే ఈసారి కూడా ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేట్ అయిన ఐదుగురితో పాటు ముగ్గురు జ్యూరీ సభ్యులు ఏకాభిప్రాయంతో సేఫ్‌లో ఉన్న అమర్, తేజ, ప్రశాంత్ నుంచి ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయాలని చెప్పాడు. దీంతో శివాజీ, సందీప్, శోభా మాట్లాడుకొని ఫైనల్ గా తేజను నామినేషన్ లోకి తీసుకొస్తారు. దీంతో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేషన్లోకి వచ్చారు. తేజ, గౌతమ్, శుభశ్రీ, రతిక, ప్రియాంక, ప్రిన్స్ నాలుగోవార నామినేషన్స్ లోకి వచ్చారు.

మరి ఈవారం పవరాస్త్రకు బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఎలాంటి టాస్క్ లు ఇచ్చాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 8 =