
ట్యాగ్ · 37 కథనాలు · పేజీ 2


'ఆచార్య' రూమర్లను కొట్టిపారేసిన కొరటాల

'ఆచార్య' మెయిన్ ఎమోషన్ చరణ్ దే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ?

ఎన్టీఆర్ కథ మొదలుపెట్టిన కొరటాల

కొరటాలతో బన్నీ సినిమాపై నిర్మాతల క్లారిటీ
ప్రభాస్ 'మిర్చి'కి 8 ఏళ్లు
ఏజెంట్ క్లారిటీ .. 'కొరటాల శివ' తో చెయ్యట్లేదు
'ఆచార్య'లో చరణ్ ఎంట్రీ అప్పుడే..!

5 సంవత్సరాల "శ్రీమంతుడు "
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
చిరంజీవి, రామ్ చరణ్ ల స్టైలిష్ ఫైట్ ?

మరోసారి `మిర్చి` కాంబినేషన్?
రామ్ చరణ్ తో కొరటాల శివ తదుపరి చిత్రం?

మహేష్ తో మరోమారు కొరటాల?

"ఆచార్య "కు 20డేస్ వర్క్ బ్యాలెన్స్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

'ఆచార్య' రూమర్లను కొట్టిపారేసిన కొరటాల
మెగాస్టార్ చిరు- తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వస్తున్న సినిమా ఆచార్య. అప్పుడెప్పుడో ‘మగధీర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్న క్యామియో రోల్ చేశాడు. ఆ తరువాత ఒకపాటలో కలిసి చిందేశారు. అది తప్పితే ఈ తండ్రీ కొడుకులిద్దరూ ఇప్పటిదాకా కలిసి నటించింది లేదు. కానీ ఇప్పుడు ‘ఆచార్య’ లో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. దీంతో ఈ సినిమా కోసం ఈ కాంబినేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'ఆచార్య' మెయిన్ ఎమోషన్ చరణ్ దే
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇక ఇప్పుడు ఈసినిమాను మే13న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇంకా షూటింగే పూర్తి కాలేదు.. మే 13న రావడం కష్టమే. దానికితోడు కరోనా రావడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ కరోనా తగ్గితే మళ్లీ షూటింగ్ ను ప్రారంభిస్తారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన "జనతా గ్యారేజ్ "మూవీ ఘనవిజయం సాధించింది.

ఎన్టీఆర్ కథ మొదలుపెట్టిన కొరటాల
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి సినిమాలు అయిపోయిన తరువాత జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇక ఇదిలాఉండగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కథపై పలు వార్తలు వచ్చాయి. పల్లెటూరిలో ఉండే ఓ వ్యక్తి సిటీకి వచ్చి.. అక్కడ అతను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల అప్పటి నుంచి ఆయన ఎలా మారతాడు? అనే పాయింట్ తీసుకొని ఎన్టీఆర్‌ని ప్రేక్షకుల ముందుకు కొరటాల తీసుకొస్తున్నట్టు పలు కథనాలు వచ్చాయి.

కొరటాలతో బన్నీ సినిమాపై నిర్మాతల క్లారిటీ
గత కొద్దిరోజులగా కొరటాల శివ, బన్నీ, ఎన్టీఆర్ వీరి నెక్స్ట్ ప్రాజెక్ట్ లపైన చాలా కన్ప్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకూ బన్నీ పుష్ప తరువాత కొరటాల శివతో సినిమా చేస్తాడనుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని ఫిక్స్ అయిపోయారు. కానీ ఎన్టీఆర్ 30 సినిమా కొరటాలతో ఉంటుందని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఎన్టీఆర్ సినిమాపై ఉన్న కన్ప్యూజన్ పోయింది ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఈ సినిమాతో ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. ఇక ఇప్పుడు దీనిపై బన్నీ నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో యువసుధ సంస్థ ఓ ట్వీటు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉందని.. ఏప్రిల్…
ప్రభాస్ 'మిర్చి'కి 8 ఏళ్లు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు విజయవంతమైన యాక్షన్ ఎంటర్టైనర్స్ లో సందడి చేసాడు. వాటిలో 'మిర్చి' ఒకటి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన తొలి చిత్రమిది. రచయిత నుండి దర్శకుడిగా మారిన ఈ సినిమాతో... శివ మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్య రాజ్, నదియా, సంపత్ రాజ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి తొలి అడుగు వేయడం విశేషం.
ఏజెంట్ క్లారిటీ .. 'కొరటాల శివ' తో చెయ్యట్లేదు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో హీరోగా గుర్తింపు తెచుకున్నాడు. బాలీవుడ్ సినిమా చిచోరేలో కనిపించాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కనిపించిన ఈ సినిమాలో నవీన్, తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగులో నవీన్ పోలిశెట్టి తన రెండవ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వం లో జాతి రత్నాలు అనే కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

కొరటాల సీరియస్-ఇది నా కథ.. అందరికీ వినిపించాలా..!
కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై రాజేష్ అనే వ్యక్తి ఈ కథ నాదే అని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఆరోపణలపై చిత్రయూనిట్ స్పందించి క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా అతను చెప్పిన కథ నచ్చలేదు కాబట్టే మేము ఆ సినిమాను చేయలేదని వారు వివరణ ఇచ్చారు. దానికి.. దీనికి సంబంధం లేదని అన్నారు. ఇక ఇప్పుడు ఈవార్తలపై కొరటాల కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆచార్య'లో చరణ్ ఎంట్రీ అప్పుడే..!
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా40 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం సినిమా మొదలైనప్పటినుండి వింటూనే వున్నాం. మధ్యలో కొంత మంది పేర్లు వినిపించినా.. చరణే ఫైనల్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

5 సంవత్సరాల "శ్రీమంతుడు "
జి. మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , శృతి హాసన్ జంటగా ఊరు దత్తత నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామా "శ్రీమంతుడు "మూవీ 2015 సంవత్సరం ఆగస్ట్ 7 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , ఐఫా , సైమా అవార్డ్స్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం "శ్రీమంతుడు "మూవీకి హైలైట్ గా నిలిచింది .
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా.. ఈ కాంబినేషన్ పై ఇప్పటినుండి కాదు గత కొద్దిరోజులుగా వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా ఫిక్స్ అయిందని... త్వరలో అప్ డేట్ కూడా ఇస్తారన్న వార్తలు వినిపించాయి. ఇక ఈ కాంబినేషన్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. అయితే ఇప్పుడు అనుమానాలన్నిటికి బ్రేక్ వేసి అధికారిక ప్రకటన ఇచ్చేసారు. బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
చిరంజీవి, రామ్ చరణ్ ల స్టైలిష్ ఫైట్ ?
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

తెలుగు సంవత్సరాదికి `ఆచార్య` ఫస్ట్ ఇంప్రెషన్
23 ఏళ్ళ క్రితం `మాస్టర్`గా మురిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు `ఆచార్య`గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో.. చిరు ఇదివరకు ఎన్నడూ పోషించని పాత్రలో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో జరుగుతోంది. ఇటీవల పోలవరం పరిసర ప్రాంతాల్లో కొన్ని పోరాట ఘట్టాలను చిత్రీకరించిన యూనిట్.. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభించనుంది.

మరోసారి `మిర్చి` కాంబినేషన్?
వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు కొరటాల శివ. `మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను`... ఇలా నాలుగు విజయవంతమైన చిత్రాలను అందించిన కొరటాల.. ప్రస్తుతం తన ఐదో చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో `ఆచార్య` పేరుతో రూపొందిస్తున్నాడు. ఆగస్టులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ఆపై ఆరో చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించడానికి శివ సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు.. కొరటాల శివ రూపొందించబోయే 7వ చిత్రం కూడా ఇప్పటికే సెట్ అయిందట.
రామ్ చరణ్ తో కొరటాల శివ తదుపరి చిత్రం?
`మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను`.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో `ఆచార్య` పేరిట ఓ సోషల్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు. మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఆగస్టులో జనం ముందుకు రానుంది.

మహేష్ తో మరోమారు కొరటాల?
సూపర్ స్టార్ మహేష్ బాబుకి అచ్చొచ్చిన దర్శకుల్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `శ్రీమంతుడు` (2015), `భరత్ అనే నేను` (2018) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కట్ చేస్తే... వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి మరో సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అదే ఏడాది చివరలో తెరపైకి వచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే మహేష్, కొరటాల థర్డ్ జాయింట్ వెంచర్ పై మరింత క్లారిటీ వస్తుంది.