మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇక ఇప్పుడు ఈసినిమాను మే13న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇంకా షూటింగే పూర్తి కాలేదు.. మే 13న రావడం కష్టమే. దానికితోడు కరోనా రావడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ కరోనా తగ్గితే మళ్లీ షూటింగ్ ను ప్రారంభిస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న కొరటాల ఈసినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయినట్టే.. ఇంకా పదిరోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.. అది కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాం అని తెలిపారు. ఇంకా రామ్ చరణ్ రోల్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు. ‘ఆచార్య’లో మెయిన్ ఎమోషన్ చరణ్ చుట్టూనే రన్ అవుతుంది.. సెకండాఫ్ లో దాదాపు తన పాత్ర కనిపిస్తుందని తెలిపారు. త్వరలోనే చరణ్, పూజా హెగ్డేలపై చిత్రీకకరించిన ‘నీలాంబరి’ సాంగ్‌ను విడుదల చేస్తామని అన్నారు కొరటాల శివ.
కాగా ఈ సినిమా దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























