మెగాస్టార్ చిరు- తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వస్తున్న సినిమా ఆచార్య. అప్పుడెప్పుడో ‘మగధీర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్న క్యామియో రోల్ చేశాడు. ఆ తరువాత ఒకపాటలో కలిసి చిందేశారు. అది తప్పితే ఈ తండ్రీ కొడుకులిద్దరూ ఇప్పటిదాకా కలిసి నటించింది లేదు. కానీ ఇప్పుడు ‘ఆచార్య’ లో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. దీంతో ఈ సినిమా కోసం ఈ కాంబినేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో చరణ్ రోల్ పై ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏదో అతిథి పాత్రలో కాకుండా దాదాపు సెకండ్ హాఫ్ మొత్తం చరణే ఉంటాడని ఇప్పటికే తెలిపారు. ఈనేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈసినిమాలో చిరు-చరణ్ తండ్రీ కొడుకులుగా చేస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఈ వార్తలపై కొరటాల స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆచార్య’లో చిరు, చరణ్ చేస్తున్నది తండ్రీ కొడుకుల పాత్రలు కాదని.. చరణ్ పాత్ర దాదాపు 40నిమిషాల వరకూ ఉంటుంది.. పాత్ర నిడివి ఎంత అన్నది ముఖ్యం కాదని, కథలో దాని ప్రాధాన్యత ఏంటో చూడాలని అంటున్నాడు దర్శకుడు కొరటాల శివ.
ఇక పరిస్థితులు అన్నీ బావుంటే ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అయి ఉండేది. మెగాఫ్యాన్స్ కోరిక కూడా తీరిపోయేది. కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. దాదాపు అయిపోయింది. ఒక్క పదిరోజుల షూట్ మాత్రమే మిగిలిఉంది. ఈ టైమ్ ను పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవడానికి వినియోగించుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: