23 ఏళ్ళ క్రితం `మాస్టర్`గా మురిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు `ఆచార్య`గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో.. చిరు ఇదివరకు ఎన్నడూ పోషించని పాత్రలో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో జరుగుతోంది. ఇటీవల పోలవరం పరిసర ప్రాంతాల్లో కొన్ని పోరాట ఘట్టాలను చిత్రీకరించిన యూనిట్.. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. `ఆచార్య`కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని తెలుగు సంవత్సరాది సందర్భంగా విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేసిందట. టైటిల్ లోగోతో పాటు చిరు లుక్ ని కూడా ఉగాది రోజున ఆవిష్కరించనున్నారట. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న `ఆచార్య`కి మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు. ఆగస్టులో `ఆచార్య` రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























