
ట్యాగ్ · 29 కథనాలు


మహేష్ తో సినిమా ఖచ్చితంగా ఉంటుంది

అఖండ మూవీ సీక్వెల్ పై బాలకృష్ణ క్లారిటీ

యాక్షన్ సీన్స్ తో ప్రారంభం అయిన #RAPO20 మూవీ షూటింగ్

కన్ఫామ్.. రామ్ హీరోయిన్ గా శ్రీలీల

మరో స్టన్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తో హీరో రామ్

మహేష్ తో సినిమా చేయాలని ఉంది..!

సూర్యతో పక్కా వర్క్ చేస్తా..!

50రోజుల "అఖండ"

150 కోట్ల క్లబ్ లో "అఖండ"

అల్లు అర్జున్ కు జోడీగా కీర్తి సురేష్ ?

దండేలి అభయారణ్యం లో "BB3 "
ఐఎఎస్ ఆఫీసర్ గా బాలకృష్ణ

నంద్యాలలో "BB3 " మూవీ షూటింగ్
షూట్ కు రెడీ అయిన బాలయ్య
కన్ఫామ్ బాలయ్య సినిమాలో సయేషా

ఐదు నిమిషాలు చూస్తేనే.. ఆ ఫీల్ వచ్చింది
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

చేసిన పాత్ర చేయకుండా 50 ఏళ్లు నటించడం బాలయ్యకే సాధ్యం
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

మహేష్ తో సినిమా ఖచ్చితంగా ఉంటుంది
ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కోసం సినీ ప్రేక్షకులు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అలాంటి కాంబినేషన్స్ లో రాజమౌళి-మహేష్ ది ఒకటి. ఈ కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది. రాజమౌళి తన సినిమా మహేష్ తోనే చేస్తున్నాడు. అయితే మరో కాంబినేషన్ కోసం కూడా అందరూ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అదే బోయపాటి శ్రీను-మహేష్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది..వస్తే ఎలా ఉంటుంది అని చూస్తున్నారు.

అఖండ మూవీ సీక్వెల్ పై బాలకృష్ణ క్లారిటీ
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 2022 జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. అఖండ మూవీ…

మరోసారి బాలకృష్ణతో బోయపాటి?
నందమూరి బాలకృష్ణ-బోయిపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటది. చాలా పవర్ ఫుల్ కాంబినేషన్. ఆ విషయం ఇప్పటికే వీరిద్దరూ నిరూపించారు కూడా.. సింహా సినిమాతో మొదలైన వీరిద్దరి కాంబినేషన్ ఆతరువత లెజెండ్, రీసెంట్ గా అఖండ వరకూ సాగింది. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. బోయపాటి శ్రీను మాస్ కు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమాల ఫలితాలే నిదర్శనం. సింహా సినిమాతో క్రేజీ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నమ్మకంతోనే లెజెండ్ సినిమాను తెరకెక్కించారు. ఇక రీసెంట్ గా అఖండ సినిమాతో హ్యాట్రిక్ ను కొట్టారు.

యాక్షన్ సీన్స్ తో ప్రారంభం అయిన #RAPO20 మూవీ షూటింగ్
పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీలో పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల కథానాయికగా ఎంపిక అయ్యారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

కన్ఫామ్.. రామ్ హీరోయిన్ గా శ్రీలీల
ఈ ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. బోయపాటి శ్రీను-ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది కానీ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా అప్ డేట్స్ ను దసరా నుండి స్టార్ట్ చేయనున్నట్టు తెలిపారు. ఇక చెప్పినట్టే క్రేజీ అప్ డేట్ ఇచ్చారు చిత్రబృందం.

మరో స్టన్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తో హీరో రామ్
ఇస్మార్ట్ శంకర్ , రెడ్ , ది వారియర్ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.

మహేష్ తో సినిమా చేయాలని ఉంది..!
ఎన్ని సినిమాలు చేసినా ప్రతి హీరోకు హీరోయిన్ కు కొన్ని స్పెషల్ రోల్స్ లో చేయాలని.. పలానా జోనర్ లో చేయాలని ఉంటుంది. ఇక డైరెక్టర్స్ కు అలానే ఉంటుంది. స్టార్ హీరోలతో చేయాలని ఉంటుంది. అలానే తమకు కూడా పలానా హీరోతో చేయాలన్న కోరిక ఉంటుంది. ఇక ఇప్పుడు బోయపాటి కూడా ఒక హీరోతో ఎప్పటినుండో చేయాలనుకుంటున్నాడట. మరి ఆహీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి.. తనకు ఎప్పటినుండో మహేష్ ను డైరెక్ట్ చేయాలని ఉందని.. ఫ్యూచర్ లో తను కనుక ఛాన్స్ ఇస్తే తప్పకుండా మహేష్ ను డైరెక్ట్ చేస్తానని తెలిపాడు. మరి ఫ్యూచర్ లో కనుక బోయపాటితో సినిమా చేసే అవకాశం వస్తే వీరిద్దరి ఖచ్చితంగా క్రేజీ…

సూర్యతో పక్కా వర్క్ చేస్తా..!
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆకాశం నీ హద్దురా..!, జై భీమ్ లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఓ మాస్ మసాలా చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాండి రాజ్ దర్శకత్వంలో సూర్య ఈటీ సినిమా చేస్తున్నాడు.మార్చి 10 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే తెలుగు లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.

50రోజుల "అఖండ"
హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య ల స్క్రీన్ కెమిస్ట్రీ అలరించింది.

150 కోట్ల క్లబ్ లో "అఖండ"
హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

అల్లు అర్జున్ కు జోడీగా కీర్తి సురేష్ ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ "పుష్ప : ది రైజ్" మూవీ డిసెంబర్ 17 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన "సరైనోడు "మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దండేలి అభయారణ్యం లో "BB3 "
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ "BB3 " తెరకెక్కుతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 “మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర “BB3″మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

బోయపాటి దర్శకత్వంలో రామ్ ?
సూపర్ హిట్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అభిమానులు ఎనర్జిటిక్ స్టార్ గా పిలుచుకునే హీరో రామ్ లవర్ బాయ్ ఇమేజ్ నుండి పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన "ఇస్మార్ట్ శంకర్ "మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

బాలయ్య - బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా కన్ఫామ్ చేయని ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఈమధ్యనే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టగా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ నెల రెండో వారంనుండి చివరి షెడ్యూల్ ప్రారంభించనున్నటు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రాగా.. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా ఇవ్వలేదు బోయపాటి.
ఐఎఎస్ ఆఫీసర్ గా బాలకృష్ణ
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా మూవీస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ఐఎఎస్ ఆఫీసర్, అఘోరా గా రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. "BB3 " మూవీలో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలుగా ఎంపికఅయ్యారు. శ్రీకాంత్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

నంద్యాలలో "BB3 " మూవీ షూటింగ్
మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించే బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా ", "లెజెండ్ "మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషషన్స్ బ్యానర్ పై వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "BB3 " తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , నవీన్ చంద్ర విలన్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు.
షూట్ కు రెడీ అయిన బాలయ్య
ఇప్పటికే టాలీవుడ్ మొత్తం షూటింగ్ లతో బిజీ అయిపోయింది. ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో ఉన్న హీరోలందరూ షూటింగ్ లతో బిజీ అయిపోతుంది. ఇప్పుడు బాలయ్య కూడా షూట్ కు రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే బోయపాటి షూట్ ను స్టార్ట్ చేసాడు. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. అయితే ఈ షూటింగ్ లో బాలయ్య పాల్గొనలేదు. ఈ రోజునుండి మరో షెడ్యూల్ ప్రారంభం కానుండగా.. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ కూడా పాల్గొననున్నాడట. అంతేకాదు హీరోయిన్ సయేషా, పూర్ణ కూడా ఈషెడ్యూల్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.
కన్ఫామ్ బాలయ్య సినిమాలో సయేషా
'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్రలో రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నట్టు తెలుస్తుంది.