ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కోసం సినీ ప్రేక్షకులు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అలాంటి కాంబినేషన్స్ లో రాజమౌళి-మహేష్ ది ఒకటి. ఈ కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది. రాజమౌళి తన సినిమా మహేష్ తోనే చేస్తున్నాడు. అయితే మరో కాంబినేషన్ కోసం కూడా అందరూ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అదే బోయపాటి శ్రీను-మహేష్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది..వస్తే ఎలా ఉంటుంది అని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు తమ కాంబినేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు బోయపాటి. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న బోయపాటిని మహేష్ తో సినిమా ఎప్పుడని అడుగగా దానికి బోయపాటి క్లారిటీ ఇచ్చారు. మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఖచ్చితంగా ఉంటుంది.. స్టోరీ డిస్కషన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.. ప్రతి ఒక్క హీరోకు ఒక స్టైల్ ఉంటుంది.. మహేష్ కు నా వర్కింగ్ స్టైల్ పై కొంచం డౌట్ ఉంది.. అయితే నేను మీరు నాతో వర్క్ చేయండి.. మీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పాను. నేను వర్క్ చేసే హీరోలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను.. వారు ఎలాంటి ఇష్యూను ఫేస్ చేయకుండా చూస్తాను.. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ను తీసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇద్దరి షెడ్యూల్స్ కుదరకపోవడంతోనే మా ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.. మహేష్ ఆల్ రౌండర్.. తనతో మంచి కమర్షియల్ సినిమా చేయాలని ఉందని తెలిపాడు.
మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమాకు ఖచ్చితంగా స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీ ఉన్నారు. అవి కంప్లీట్ అయి వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: