మహేష్ తో సినిమా చేయాలని ఉంది..!

This Director Wants To Work With Superstar Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Superstar Mahesh babu,Mahesh babu Upcoming Movies,Boyapati Srinu and Mahesh Babu,Mahesh Babu latest Movie Updates,Mahesh Babu Upcoming Movie Updates,Mahesh Babu Sarkaru Vaari paata Movie Updates, Boyapati Srinu,Director Boyapati Srinu,Boyapati Srinu Movies,Boyapati Srinu Latest Blockbuster Movies,Boyapati Srinu Want to Work with Mahesh babu,Boyapati Srinu Want to work with Super Star Mahesh babu, Boyapati Srinu About Mahesh Babu

ఎన్ని సినిమాలు చేసినా ప్రతి హీరోకు హీరోయిన్ కు కొన్ని స్పెషల్ రోల్స్ లో చేయాలని.. పలానా జోనర్ లో చేయాలని ఉంటుంది. ఇక డైరెక్టర్స్ కు అలానే ఉంటుంది. స్టార్ హీరోలతో చేయాలని ఉంటుంది. అలానే తమకు కూడా పలానా హీరోతో చేయాలన్న కోరిక ఉంటుంది. ఇక ఇప్పుడు బోయపాటి కూడా ఒక హీరోతో ఎప్పటినుండో చేయాలనుకుంటున్నాడట. మరి ఆహీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి.. తనకు ఎప్పటినుండో మహేష్ ను డైరెక్ట్ చేయాలని ఉందని.. ఫ్యూచర్ లో తను కనుక ఛాన్స్ ఇస్తే తప్పకుండా మహేష్ ను డైరెక్ట్ చేస్తానని తెలిపాడు. మరి ఫ్యూచర్ లో కనుక బోయపాటితో సినిమా చేసే అవకాశం వస్తే వీరిద్దరి ఖచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మాస్ సినిమాలు ఎక్కువగా తీసే బోయపాటి మహేష్ ను ఎలా చూపిస్తాడో అన్నది కూడా క్యూరియాసిటీ ఉంటుంది. చూద్దాం మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయడమే కాకుండా వరుసగా పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. మూడో పాట కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్,14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. రాజమౌళి తో కూడా మరో సినిమా లైన్ లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.