ఐదు నిమిషాలు చూస్తేనే.. ఆ ఫీల్ వచ్చింది

Boyapati Srinu Extends Best Wishes To Devaki Nandana Vasudeva Unit

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి ‘గుణ 369’తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నవదళపతి సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్‌లుగా పాల్గొన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దేవకి నందన వాసుదేవ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. ముందుగా జయదేవ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయనకి సినిమా గురించి తెలియదు అని చెప్పారు. నిజంగా ఆయనకి సినిమా గురించి తెలియదు కానీ వేల కుటుంబాలకి అన్నం పెట్టడం తెలుసు. ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్ లో గొంతు వినిపించడం తెలుసు.”

“ఈరోజు అనుభవిస్తున్న కొన్ని ఫలితాల్లో ప్రధాన పాత్ర జయదేవ్ గారిదే. ఈరోజు సొసైటీకి ఆయనకి తెలిసిందే కావాలి. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక ఐదేళ్ళు ఏకాగ్రత తో పని చేస్తే దేశం మొత్తం గర్వించదగ్గ ఇండస్ట్రీ లిస్ట్ అవ్వగల స్థాయిలో వున్న అశోక్, ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైనటువంటి సినీ ఫీల్డ్ ని ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి ఆదరించమని అడుగుతున్నారు.”

“నిజంగా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా తనని ఆశీర్వదించాలి. ఇండస్ట్రీలో నిజాయితీగా పనిచేస్తే ఎవరికైనా స్థానం ఉంటుంది. నిజాయితీగా పనిచేస్తే ఈ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. నిజాయితీగా పని చేస్తున్న అశోక్ గ్యారెంటీగా నిలబడతాడు. తప్పకుండా ఈ సినిమా పరిశ్రమ తనని నిలబడుతుంది. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల కి అశోక్ కి సింక్ చాలా బాగుంది.”

“మొదటి సినిమా మనల్ని పరిచయం చేస్తుంది. రెండో సినిమా నువ్వేంటో చెబుతుంది. ఈ సినిమా ఈ ఇద్దరికీ అగ్నిపరీక్షే. ఈ అగ్ని పరీక్షని ఎదుర్కొని గ్యారెంటీగా నిలబడతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా తీశారు. ఐదు నిమిషాలు సినిమా చూపిస్తే అందరూ క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే దాని అవుట్ పుట్ అలా ఉంది.సినిమా మంచి హిట్ కావాలి.”

“మ్యూజిక్ విజువల్స్ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఈ సినిమా చూడాలని ఆసక్తిని రేకెత్తించాయి. నేను కూడా అశోక్ ఇంట్రడక్షన్ చూడాలని ఎదురు చూశాను. ఈ కాన్ఫిడెన్స్ తో వాళ్లు ముందుగానే ఐదు నిమిషాల పాటు ఈ సినిమా చూపించడం అనేది అభినందించదగ్గ విషయం. తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి చూడాలని మంచి ఫీల్ వచ్చింది. ఇలాంటి దర్శకులు హీరోలు బ్రహ్మాండంగా నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.”

“మనం చేసిన కథ మరొకరికి ఇవ్వాలంటే మంచి మనసు ఉండాలి. అలా మంచి మనసుతో కథని ఇచ్చిన ప్రశాంత్ వర్మ గారు ఎప్పుడూ బాగుండాలి. ఈ సినిమా 22వ తారీఖున విడుదలవుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా కాదా అని ఉంటుంది. 100% మంచి సినిమా అని అనిపించింది. థియేటర్స్ లో కూడా అదే రిజల్ట్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ” అని అన్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.