
ట్యాగ్ · 55 కథనాలు


రాజావారు రాణిగారు డైరెక్టర్ తో దిల్ రాజు సినిమా

20 ఏళ్ల సక్సెఫుల్ జర్నీ

బలగం షోస్ ఆపేదే లేదు

"థాంక్యూ " మూవీ గురించి దిల్ రాజు మాటలలో

"ఆర్ ఆర్ ఆర్" టీమ్ కు దిల్ రాజు స్పెషల్ పార్టీ

'ఆర్ఆర్ఆర్' వస్తే నేను తప్పుకోవాల్సిందే..!

'RC 15' లో నా పాత్ర చూసి షాకవుతారు..!

'రౌడీబాయ్స్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

ఈ రోజు సాయంత్రం "రౌడీ బాయ్స్ "మ్యూజికల్ ఈవెంట్

మార్కో డైరెక్టర్‌తో దిల్ రాజు ప్రొడక్షన్స్ మల్టీస్టారర్
టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో నాని, సూర్య ఇద్దరూ పోటాపోటీగా నటించారు - దిల్ రాజు
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

రాజావారు రాణిగారు డైరెక్టర్ తో దిల్ రాజు సినిమా
టాలీవుడ్ టాప్ ప్రొడ్యసర్ దిల్ రాజు ఒక పక్క పెద్ద పెద్ద హీరోలతో.. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ ఒరింయెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. కథలో కంటెంట్ ఉంటే దిల్ రాజు చిన్న సినిమాలు కూడా తీయడానికి ఎప్పుడు ముందుంటాడు. ఇక ఇప్పటికే పలు సినిమాలు నిర్మిస్తుండగా.. ఇప్పుడు మరో సినిమాను ప్రకటించాడు. రాజావారు రాణిగారు సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు రవి కిరణ్ కోలా. ఈసినిమాతోనే కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈసినిమా మంచి విజయం సాధించింది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ లాంటి సినిమాలను అందరూ ఎంకరేజ్ చేయాలి
పి మహేష్ బాబు దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. అందుకే విమర్శకుల ప్రశంసలతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో టాప్ ప్రొడ్యూసర్ కూడా చేరిపోయారు. తాజాగా హైదరాబాద్ లోని యూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొని ఈసినిమాపై ప్రశంసలు కురిపించారు.

'బలగం' తర్వాత.. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి త్వరలో కొత్త సినిమా
ఇటీవలి కాలంలో తెలుగు చలచిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అతి తక్కువ సినిమాలలో 'బలగం' ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విజయం సాధించడం వెనుక ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమా ఏంటి? ఎప్పుడు వస్తుంది? అని అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ కొత్త సినిమాపై కీలక ప్రకటన చేసింది. ఈరోజు ట్విట్టర్ వేదికగా కొత్త సినిమా గురించి.. 'మీ అందరినీ ఆకట్టుకునేలా కొత్త ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. మా తదుపరి ప్రకటన 24న వెలువడుతోంది. ఇది ఒక సంగీత ప్రేమ కథ' అని…

డబ్బు కావాల్సినప్పుడల్లా తొలిప్రేమ రీరిలీజ్ చేసేవాడిని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన స్టైల్ తో తన స్వాగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక పవర్ స్టార్ కు అంత క్రేజ్ రావడానికి కారణమైన సినిమా ఏదేంటే తొలిప్రేమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు ట్రెండ్ సెట్ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఇక ఈసినిమాతోనే పవన్ కళ్యాణ్ రేంజ్ మారిపోయింది. సిన్సియర్ లవర్‌గా పవన్ యాక్టింగ్, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

20 ఏళ్ల సక్సెఫుల్ జర్నీ
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. నిజానికి దిల్ రాజు అసలు రేపు వెంకట రమణా రెడ్డి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు 2003లో నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ మూవీని తొలిసారిగా నిర్మించారు. నిర్మాతగా ఫస్ట్ సినిమాతోనే తన బ్యానర్ పై మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆసినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజు అయ్యాడు. ఇక అక్కడి నుండి నిర్మాతగా తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దిల్ తర్వాత ఆయన వచ్చిన…

బలగం షోస్ ఆపేదే లేదు
మన తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులతో పాటు ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకుంది. చాలా చిన్న సినిమాగా అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా బలగం. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బలగం. తెలంగాణ సంస్కృతి, మానవ సంబంధాలని మనసులకు హత్తుకునేలా భావోద్వేగాలతో నిండిన కథను తీసుకొచ్చి దర్శకుడిగా విజయాన్ని సాధించాడు.

బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పీచ్
శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీ ధర్, విజయలక్ష్మి, మొగిలి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

RC 15 ఫస్ట్ లుక్ గురించి దిల్ రాజు
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నరామ్ చరణ్ ఇప్పుడు 'RC 15' పై తన ఫోకస్ మొత్తం పెట్టాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు అభిమానులు ఈసినిమా గురించి అప్ డేట్ ఎప్పుడిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"థాంక్యూ " మూవీ గురించి దిల్ రాజు మాటలలో
యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో నాగ చైతన్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'థాంక్యూ' టీజర్ పై రానా.. ఆల్రెడీ సరైపోయావు బ్రదర్..!
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రావడంతో రిలీజ్ డేట్ కూడా లేట్ అయింది ఫైనల్ గా జూలై 8న విడుదల అవుతోంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇక ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈటీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. నాగ చైతన్య.. క్లాస్, మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా అంటూ చై చెప్పిన హైలెట్ గా…

"ఆర్ ఆర్ ఆర్" నాటు నాటు సాంగ్ కు రాజమౌళి , అనిల్ రావిపూడి డ్యాన్స్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న విజువల్ వండర్“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది."ఆర్ఆర్ఆర్”మూవీ నైజాంలో దిల్ రాజు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. నైజాంలో రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో “ఆర్ఆర్ఆర్”మూవీ టీమ్‌కి దిల్ రాజు సక్సెస్ పార్టీ ఇచ్చారు.

"ఆర్ ఆర్ ఆర్" టీమ్ కు దిల్ రాజు స్పెషల్ పార్టీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న…

'ఆర్ఆర్ఆర్' వస్తే నేను తప్పుకోవాల్సిందే..!
కరోనా థర్డ్ వేవ్ వచ్చి పెద్ద సినిమా రిలీజ్ కు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. లేకపోతే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యేవి. కానీ తెలిసిందే కదా. కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం.. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూసేయడంతో పెద్ద సినిమాల రిలీజ్ లను వాయిదా వేశారు. ఇక తాజాాగా ఈసినిమాల రిలీజ్ లపై దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు.

చరణ్, విజయ్ సినిమాల రిలీజ్ డేట్లు చెప్పిన దిల్ రాజు..!
బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి మేకర్స్ ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక మన నిర్మాతలు కూడా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర బాషల్లో కూడా సినిమాలు చేయడానికి.. తమ మార్కెట్ ను పెంచుకోవడానికి చూస్తున్నారు. ఇక అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దిల్ రాజుగురించి. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ఇప్పటికే తన మార్క్ ను చూపించాడు దిల్ రాజు.

'RC 15' లో నా పాత్ర చూసి షాకవుతారు..!
ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ కథా చిత్రాలతో అలరించిన స్టార్ హీరోలు ఇప్పుడు ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో, విలన్ పాత్రల్లో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో ఫస్ట్ ప్లేస్ లో జగపతి బాబు ఉండగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి శ్రీకాంత్ కూడా చేరిపోయాడు. తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఇన్నేళ్ల తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాడు.. ఎన్నో పాత్రలు పోషించాడు. ఇక ఇప్పుడు హీరోగా చేస్తూనే మరోపక్క పలు కీలక పాత్రలు చేస్తున్నాడు. రీసెంట్ గా అఖండలో విలన్ పాత్రలో చేసి మరోసారి ప్రశంసలు అందుకున్నాడు.

'రౌడీ బాయ్స్' రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ స్టోరీ
ఓవరాల్ గా చెప్పాలంటే యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి యూత్ ను మాత్రం ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం చాలా అరుదైపోయింది. ఈనేపథ్యంలో మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీని చూడాలంటే ఈసినిమాను చూడొచ్చు.

'రౌడీబాయ్స్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా చాలా భారీగానే చేశారు మేకర్స్. మరి ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఇక ఈసినిమా చూడటానికి ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

ఈ రోజు సాయంత్రం "రౌడీ బాయ్స్ "మ్యూజికల్ ఈవెంట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ సాంగ్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.