‘బలగం’ తర్వాత.. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి త్వరలో కొత్త సినిమా

Dil Raju Productions New Movie Update

ఇటీవలి కాలంలో తెలుగు చలచిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అతి తక్కువ సినిమాలలో ‘బలగం’ ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విజయం సాధించడం వెనుక ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమా ఏంటి? ఎప్పుడు వస్తుంది? అని అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ కొత్త సినిమాపై కీలక ప్రకటన చేసింది. ఈరోజు ట్విట్టర్ వేదికగా కొత్త సినిమా గురించి.. ‘మీ అందరినీ ఆకట్టుకునేలా కొత్త ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. మా తదుపరి ప్రకటన 24న వెలువడుతోంది. ఇది ఒక సంగీత ప్రేమ కథ’ అని వెల్లడించింది. దీంతో అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు పరిశ్రమలో కూడా ఒక్కసారిగా దీనిపై అంచనాలు అమాంతం పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘బలగం’ సినిమా ఎంత అనూహ్య విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పలు విభాగాల్లో 100కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. తెలుగు సినిమా ప్రేక్షకులకు హాస్య నటుడిగా పరిచయమున్న వేణు ఎల్ధండి తొలిసారి దర్శకత్వం వహించడం విశేషం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, భాషను ప్రతి సన్నివేశంలోనూ అద్భుతంగా చెప్పిన తీరు చూసి దిగ్గజ దర్శకులు సైతం అచ్చెరువొందారు. అలాగే భీమ్స్‌ సంగీతం, కాసర్ల శ్యామ్‌ పాటలు, మధు కెమెరా పనితనం కూడా బలగం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే ఈ సినిమా నిర్మాణం నుంచి విడుదల వరకు ప్రతి విషయం దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి దగ్గరుండి చూసుకోవడం గమనార్హం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =