విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రావడంతో రిలీజ్ డేట్ కూడా లేట్ అయింది ఫైనల్ గా జూలై 8న విడుదల అవుతోంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇక ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈటీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. నాగ చైతన్య.. క్లాస్, మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా అంటూ చై చెప్పిన హైలెట్ గా నిలిచింది.. మొత్తానికి లవ్ ట్రాక్, కామెడీ సన్నివేవాలతో థాంక్యూ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ టీజర్ పై టాలెంటెడ్ నటుడు రానా కూడా స్పందించాడు. నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నమే థాంక్యూ అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు చైతు. ఇక చైతు ట్వీట్ కు రానా రిప్లై ఇస్తూ నువ్వు ఎప్పుడో సరైపోయావు బ్రదర్.. టీజర్ సూపర్ గా ఉంది ఉంటూ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించాడు..
Nuvvu already sari aiyipoyyavu brother 😝 superb teaser guy! Best wishes @Vikram_K_Kumar @RaashiiKhanna_ https://t.co/9s6qhMpLCx
— Rana Daggubati (@RanaDaggubati) May 26, 2022
ఇక రానా ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. ఈసినిమా జులై 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు రానా.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: