ఇందులో నాని, సూర్య ఇద్దరూ పోటాపోటీగా నటించారు – దిల్ రాజు

Producer Dil Raju Praises Nani and SJ Surya Acting in Saripodhaa Sanivaaram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movies,Nani Latest News,SJ Suryah,Sokulapalem Special Interview Bbout Saripodhaa Sanivaraam,Saripodhaa Sanivaaram,Saripodhaa Sanivaaram Movie,Saripodhaa Sanivaaram Telugu Movie,Saripodhaa Sanivaaram Movie Updates,Saripodhaa Sanivaaram Movie Latest News,Dil Raju About Nani and SJ Surya,Saripodhaa Sanivaaram Press Meet LIVE,Priyanka Mohan,Saripodhaa Sanivaaram Q&A Press Meet Live,Vivek Athreya,Priyanka,Saripodhaa Sanivaaram Press Meet,Dil Raju Praises Nani and SJ Surya,Producer Dil Raju,Dil Raju,Dil Raju Movies,Dil Raju Latest News,Producer Dil Raju Speech At Saripodhaa Sanivaaram Press Meet,Producer Dil Raju Speech,Dil Raju Comments On Nani and SJ Sury In Saripodha Sanivaram Movie Event

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మూవీ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ తర్వాత దానయ్య గారి బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యుషన్ రైట్స్‌లో పార్ట్ చేసినందుకు థాంక్ యూ దానయ్య గారు. ఎస్‌జే. సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గేమ్‌ చేంజర్‌ షూటింగ్‌లో గ్యాప్ వచ్చినప్పుడల్లా ఎక్కువగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఇద్దరూ పోటాపోటీ గా నటించారు. ట్రైలర్ చూస్తూనే అర్ధమౌతోంది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ట్రైలర్ చూసి నాని, దానయ్య గారు, డైరెక్టర్ వివేక్‌కి ఫోన్ చేశా. వివేక్ చాలా సర్‌ప్రైజ్ చేశాడు. అంతకుముందు సినిమాలని సాఫ్ట్‌గా తీశాడు, కానీ ఈ సినిమాని ఇరగదీశాడు. నాని గారితో మేము చేసిన ఎంసీఏ పెద్ద హిట్టు. దాన్ని దసరా బీట్ చేసింది. దసరాని సరిపోదా శనివారం బీట్ చేయబోతోందని ట్రైలర్ చూసి కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. ఆగస్ట్ 29న నాని గారికి దసరాని బ్రేక్ చేసే సినిమా రాబోతోంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా 29న బ్లాస్ట్ కాబోతోంది. ఈ సినిమా విజయం యూనిట్‌కి ఎంత అవసరమో సినిమా ఇండస్ట్రీకి కూడా అంత అవసరం. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.