బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి మేకర్స్ ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక మన నిర్మాతలు కూడా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర బాషల్లో కూడా సినిమాలు చేయడానికి.. తమ మార్కెట్ ను పెంచుకోవడానికి చూస్తున్నారు. ఇక అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దిల్ రాజుగురించి. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ఇప్పటికే తన మార్క్ ను చూపించాడు దిల్ రాజు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తమిళ్, హిందీలో కూడా సినిమాలను నిర్మిస్తూ అక్కడ కూడా తన సత్తా చూపించడానికి రెడీ అయిపోతున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తన సినిమాల గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు. చాలా కాలం నుండి హిందీలో కూడా సినిమాలు చేయాలని చూస్తున్నాం.. జెర్సీ సినిమాతో అది సాధ్యమైంది.. ఇంకా హిట్ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నాం.. తెలుగులో తీసినదానికంటే ఇంకా బెటర్ హిందీ ఆడియన్స్ కు నచ్చేలా ఈ రీమేక్స్ తీస్తున్నాం.. జెర్సీ సినిమా ఖచ్చితంగా హిందీ సినిమాల్లోనే బెస్ట్ సినిమా అవుతుందని చెప్పాడు.
ఇంకా శంకర్ సినిమా, విజయ్ సినిమాల గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. శంకర్ సినిమాను ఒరిజినల్ గా తెలుగులో తీసి ఆతర్వాత తమిళ్ లో హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాం.. శంకర్ సినిమా కాబట్టి అటు గ్రాండ్ గా మాత్రమే కాదు లావిషింగ్ గా కూడా ఉంటుంది.. అంతేకాకుండా రీజనల్ సినిమా మాత్రమే కాదు అందరికీ ఈసినిమా నచ్చుతుంది అని తెలియచేశారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశామన్నారు. విజయ్ సినిమా కూడా మంచి కథ.. ఇప్పటివరకూ నేను విన్న కథల్లో బెస్ట్ కథ.. విజయ్ కూడా ఈ కథ విన్నప్పుడు ఇంత వరకూ ఇలాంటి కథను వినలేదు అన్నారు.. ఒక స్టార్ హీరో నుండి అలాంటి మాటలు వినడం చాలా సంతోషంగా ఉంటుంది.. ప్రస్తుతం వంశీ కథను పూర్తి చేస్తున్నాడు.. మార్చి నుండి ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాం.. వచ్చే సంక్రాంతికి శంకర్ సినిమాను.. అలానే దీపావళికి విజయ్ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా అని తెలిపాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: