శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా చాలా భారీగానే చేశారు మేకర్స్. మరి ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఇక ఈసినిమా చూడటానికి ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు
ఈసినిమాకు అంత హైప్ రావడానికి ప్రధాన కారణం దిల్ రాజు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడం కాదు.. ఏకంగా దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో. ఇప్పటి వరకూ దిల్ రాజు తన కెరీర్ లో ఎంతో మంది హీరోలను, దర్శకులను వెండి తెరకు పరిచయం చేయడమే కాకుండా.. ఎంతో మందికి సూపర్ హిట్ లు అందించాడు. అందుకే దిల్ రాజు సినిమా అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తమ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అంతేకాదు తమ ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కాబట్టే ఏ విషయంలో దిల్ రాజు కాంప్రమైజ్ కావడంలేదు. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
ఆశిష్ రెడ్డి
రౌడీబాయ్స్ సినిమాతో ఆశిష్ రెడ్డి తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమా అయినప్పటికీ అశిష్ రెడ్డి ఈసినిమాలో అన్ని ఎలిమెంట్స్ ను బాగానే చూపించాడనిపిస్తుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, ట్లైలర్ లను చూస్తుంటే. యాక్షన్ సీక్వెన్స్ కానీ, డ్యాన్స్ లు కానీ ఇలా ప్రతి విషయంలో అశిష్ రెడ్డి ముందు జాగ్రత్తలు బాగానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. దానికి తోడు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న స్టోరీ కావడంతో ఈ కథకు కూడా అశిష్ రెడ్డి బాగా సెట్ అయ్యాడనిపిస్తుంది. దానికి తోడు అశిష్ రెడ్డి దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న వారసుడు కూడా కావడంతో ఈసినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
దేవి శ్రీ ప్రసాద్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ పేరు ముందే ఉంటుంది. రీసెంట్ గా పుష్ప ఆల్బమ్ తో దేవి మరోసారి తన మార్క్ ను చూపించాడు. ఇక దిల్ రాజు చాలా సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు. ఇక ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి సినిమా ఆల్బమ్ హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే అన్న విషయం తెలిసిందే. దీంతో దేవి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. పాటలు ఈసినిమాకు ప్లస్ పాయింట్ అవుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కథ
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఇప్పటి వరకూ చాలానే ఉన్నాయి. వాటిలో చాలా సినిమాలు మంచి విజయం సాధించినవి కూడా ఉన్నాయి. అంతేకాదు దిల్ రాజు నిర్మాణంలోనే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. దిల్, ఆర్య, జోష్ ఇంకా కేరింత సినిమాలు రాగా వాటిలో దిల్, ఆర్య ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో చూశాం. ఇక రౌడీ బాయ్స్ సినిమా కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమానే. రెండు కాలేజ్ ల మధ్య జరిగే గ్యాంగ్ వార్స్, ప్రేమ ఇలా అన్ని కోణాలు ఈసినిమాలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: