
ట్యాగ్ · 134 కథనాలు · పేజీ 5


సెన్సార్ పూర్తి చేసుకున్న నేనే వస్తున్నా

ధనుష్ తిరు తెలుగు ట్రైలర్ రిలీజ్

'సార్' టీజర్ రిలీజ్

ధనుష్ 'సార్' ఫస్ట్ లుక్ రిలీజ్-టీజర్ అప్ డేట్..!

'సార్' ఫస్ట్ లుక్, టీజర్ కు డేట్ ఫిక్స్..!

విజయ్ కు విలన్ గా ధనుష్..?

రెండు దశాబ్దాల ప్రస్థానం..!

'వెంకీ అట్లూరి' కి ధనుష్ బర్త్ డే విషెస్..!

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కు కరోనా..!

18 సంవత్సరాల వైవాహిక బంధానికి తెర

ప్రారంభం అయిన "సార్ " మూవీ షూటింగ్

ధనుష్ 'సార్' మూవీ ప్రారంభం

ధనుష్ "సార్" మూవీ షూటింగ్ నేడే ప్రారంభం

ధనుష్ సార్ మూవీ రిలీజ్ డేట్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ , సంయుక్త మీనన్ జంటగా తెలుగు , తమిళ భాషలలో సార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయి కుమార్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నేనే వస్తున్నా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నేనే వస్తున్నా
ధనుష్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్ట్ గా తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక తమిళ్ లో కూడా ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో నానే వరువెన్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.

‘కెప్టెన్ మిల్లర్’ హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇటీవలే గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా తిరు సినిమా కూడా మంచి హిట్ ను అందించింది. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న ధనుష్ అదే దిశగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ‘నానే వరువెన్’. సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించిన ఈసినిమాను ‘నేను వస్తున్నా’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈసినిమాపై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం…

ధనుష్ తిరు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయోచ్చు..

ధనుష్ తిరు తెలుగు ట్రైలర్ రిలీజ్
సౌత్ నుండి నార్త్ వరకూ.. నార్త్ నుండి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తమిళ్ స్టార్ నటుడు ధనుష్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తనకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు ధనుష్. ప్రస్తుతం అయితే పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు ధనుష్. తెలుగులో కూడా స్రైయిట్ సినిమాతో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమా టీజర్ రిలీజ్ చేశారు.

'సార్' టీజర్ రిలీజ్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరింటిన ధనుష్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో వస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మొదటినుండీ మంచి బజ్ క్రియేట్ అయింది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.

ధనుష్ "నానే వరువేన్ "మూవీ న్యూ పోస్టర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో ధనుష్ తన సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో "కాదల్ కొండెన్ ", "పుదు పేట్టై" , "మయక్కం ఎన్న " మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాల తరువాత సెల్వ రాఘవన్ , ధనుష్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కింది. వి క్రియేషన్స్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన "నానే వరువేన్ "తమిళ మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో ఇందుజ రవిచంద్రన్ , ఎల్లి అవరం కథానాయికలు. సెల్వ రాఘవన్ , ప్రభు , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ధనుష్ 'సార్' ఫస్ట్ లుక్ రిలీజ్-టీజర్ అప్ డేట్..!
తమిళ్ లో స్టార్ హీరోగా అలరిస్తున్న ధనుష్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా.. మరొకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా. వీటిలో ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి…

'సార్' ఫస్ట్ లుక్, టీజర్ కు డేట్ ఫిక్స్..!
తమిళ్ హీరోలు కూడా ఇప్పుడు తెలుగులో స్ట్రైయిట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో టాలెంటెడ్ హీరో ధనుష్ కూడా ఉన్నాడు. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో అలరించిన ధనుష్ ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాతో వచ్చేస్తున్నాడు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెలుగులో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళంలో ఈ చిత్రానికి వాతి అనే టైటిల్ ఖరారు చేశారుప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

'విక్రాంత్ రోణ'.. తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్న 'ధనుష్'
అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా వస్తున్న సినిమా విక్రాంత్ రోణ. ఈ సినిమా పూర్తి ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈసినిమాకు కూడా కరోనా వల్ల చాలా బ్రేక్ లు పడ్డాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 28వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మళ్లీ స్టార్ట్ చేశారు మేకర్స్.

విజయ్ కు విలన్ గా ధనుష్..?
ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరు ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ పద్దతికి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు కూడా ఇలా ఉండేది కానీ ఆ తరువాత స్టార్ హీరోలు మ్యాగ్జిమమ్ వారి సినిమాలు వారే చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా రేంజ్ పెరిగిపోయింది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక హీరోలు కూడా ఏ లాంగ్వేజ్ అయినా సరే చేసేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఒకే సినిమాలో కనిపించడానికి ఎలాంటి షరతులు పెట్టుకోవడంలేదు.

రెండు దశాబ్దాల ప్రస్థానం..!
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి చేస్తాడని తన సినిమాలను చూస్తేనే తెలుస్తుంది. 2002 లో ‘తుల్లు వాదో ఇమ్మాయ్` అనే సినిమాతో కోలీవుడ్ లో నటుడిగా పరిచయం అయ్యాడు ధనుష్. ఇక ఆతరువాత ఇప్పటి వరకూ ఎన్నో పాత్రల్లో నటించాడు. ఇక ధనుష్ తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్నాడు. ఈ ఇరవై ఏళ్లలో ధనుష్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగు సినిమానే చేసేస్తున్నాడు.

హాలీవుడ్ మూవీ "ది గ్రే మ్యాన్" ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. బాలీవుడ్ మూవీస్ తో హిందీ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ లో ధనుష్ నటిస్తున్నారు. తాజాగా ధనుష్ తాను నటిస్తున్న హాలీవుడ్ మూవీ అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

'వెంకీ అట్లూరి' కి ధనుష్ బర్త్ డే విషెస్..!
తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ముందు శేఖర్ కమ్ములతో సినిమాను ప్రకటించిన ధనుష్ ఆ తరువాత వెంటనే యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్టు ధనుష్ ప్రకటించాడు. ఇక వాటిలో ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లి ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కు కరోనా..!
సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎంతో మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా ఐశ్వర్య తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కరోనా వచ్చిందని... పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చేరినట్లు ఐశ్వర్య తెలిపారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి.. సురక్షితంగా ఉండండి.. 2022 నాకోసం ఇంకేం తీసుకొస్తుందో అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులతో పాటు సన్నిహితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

18 సంవత్సరాల వైవాహిక బంధానికి తెర
తమిళ దర్శకుడు కస్తూరి రాజా తనయుడు , దర్శకుడు సెల్వ రాఘవన్ సోదరుడు , తలైవా రజినీకాంత్ అల్లుడు ధనుష్ పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను , తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో స్ట్రయిట్ తెలుగు మూవీస్ తో ధనుష్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. 2004 సంవత్సరం నవంబర్ 18 వ తేదీ ధనుష్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ ఐశ్వర్య తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.

ప్రారంభం అయిన "సార్ " మూవీ షూటింగ్
తమిళ స్టార్ హీరో ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో సోషల్ డ్రామా “సార్ “మూవీ తెరకెక్కుతుంది. సంయుక్త మీనన్ కథానాయిక.సాయి కుమార్ తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ధనుష్ 'సార్' మూవీ ప్రారంభం
తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెలుగులో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. తెలుగులో సార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా తమిళ్ లో వాతి అనే టైటిల్ తో వస్తుంది.

ధనుష్ "సార్" మూవీ షూటింగ్ నేడే ప్రారంభం
కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్ , కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే.కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై ఫోకస్ పెడుతున్నారు. హీరోలు విజయ్ , ధనుష్ , కార్తికేయన్ తెలుగు మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.