పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. బాలీవుడ్ మూవీస్ తో హిందీ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ లో ధనుష్ నటిస్తున్నారు. తాజాగా ధనుష్ తాను నటిస్తున్న హాలీవుడ్ మూవీ అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆంథోనీ రూసో మరియు జో రూసో దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ లో “ది గ్రే మ్యాన్”హాలీవుడ్ మూవీ లో ధనుష్ నటించారు. యాక్షన్-థ్రిల్లర్‌గా తెరకెక్కిన “ది గ్రే మ్యాన్” సినిమా షూటింగ్ అమెరికాలో జరిగింది. అందుకోసం నటుడు ధనుష్ దాదాపు మూడు నెలల పాటు యూఎస్ లోనే ఉండి చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్విట్టర్ పేజీలో నటుడు ధనుష్ తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోస్ట్ చేశారు. మాస్.. పవర్ ఫుల్ లుక్ లో ధనుష్ ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “ది గ్రే మ్యాన్” మూవీ జూలై 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో రిలీజ్ కానుందని ధనుష్ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: