‘విక్రాంత్ రోణ’.. తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్న ‘ధనుష్’

Dhanush to Unveil Vikrant Ronas Tamil Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhanush,Hero Dhanush,Tamil Hero Dhanush,Tamil Superstar Dhanush,Dhanush To Unveil Trailer of Vikrant Ronas Tamil Movie,Vikrant Ronas Movie Trailer, Vikrant Ronas Tamil Movie Trailer,Vikrant Ronas Trailer,Vikrant Ronas Movie Trailer Latest Updates,Vikrant Ronas Movie Trailer Unevil By Hero Dhanush,

అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా వస్తున్న సినిమా విక్రాంత్ రోణ. ఈ సినిమా పూర్తి ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈసినిమాకు కూడా కరోనా వల్ల చాలా బ్రేక్ లు పడ్డాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 28వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మళ్లీ స్టార్ట్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు ఇప్పటికే. ఈసినిమా ట్రైలర్ ను జూన్ 23వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం ఇంకా ఇంగ్లీష్ లో కూడా ఈట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ్ ట్రైలర్ ను ధనుష్ రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

కాగా ఈసినిమాను కూడా విజువల్ వండర్‌గా తెరకెక్కించనున్నారు. ఇంకా ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ సహా నిరూప్ భండారి, నీతా అశోక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’‌ చిత్రం విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 14 =