ధనుష్ తిరు తెలుగు ట్రైలర్ రిలీజ్

dhanush thiru Movie telugu trailer released,Telugu Filmnagar,Latest Telugu Movie Trailers,Telugu Trailer 2022,Tollywood Movie Updates,Latest Telugu Trailers,Thiru Official Trailer Telugu,Dhanush,Sun Pictures,Anirudh,Mithran R Jawahar,Thiru Official Trailer,Thiru Movie Official Trailer,Thiru,Thiru Movie,Thiru Telugu Movie,Thiru Trailer,Thiru Movie Trailer,Thiru Telugu Trailer,Thiru Movie Telugu Trailer,Dhanush Thiru,Dhanush Thiru Movie,Dhanush Thiru Trailer,Dhanush Thiru Movie Trailer,Dhanush Movies,Dhanush New Movie Trailer,Dhanush Latest Movie Trailer,Raashi Khanna,Dhanush Movie Trailer,Thiru Dhanush Trailer,Thiru Telugu Movie Trailer

సౌత్ నుండి నార్త్ వరకూ.. నార్త్ నుండి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తమిళ్ స్టార్ నటుడు ధనుష్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తనకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు ధనుష్. ప్రస్తుతం అయితే పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు ధనుష్. తెలుగులో కూడా స్రైయిట్ సినిమాతో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమా టీజర్ రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా తిరుచిత్రంబ‌లం. తెలుగులో ఈసినిమాను తిరు పేరుతో రిలీజ్ చేయనున్నారు. మిత్ర‌న్ జ‌వ‌హ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్నఈసినిమా ఆగష్ట్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే నేడు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ట్రైలర్ వినోదాత్మకంగా ఉండి సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. రేయ్ పండు నీ ఆర్డ‌ర్ రెడీ అయ్యింది. ఎంత‌సేప‌టి నుండి పిల‌వాలి. వ‌చ్చి తీసుకెళ్ళు’ అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ‘నా లైఫ్ చాలా సింపుల్ లైఫ్‌. 9 టు 6 వీక్ డేస్ ఫుల్‌గా వ‌ర్క్‌. వీకెండ్ అంటే ఏదో సినిమా, టీవీ, నెట్‌ఫ్లిక్స్ చూసుకునే ఒక మాములు లైఫ్’ అంటూ హీరో చెప్పేడైలాగులతో హీరో పాత్రను చెప్పకనే చెప్పారు. ఇంకా ధ‌నుష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ రోల్ కూడా.. హీరో ఫ్రెండ్ పాత్రలో నిత్యమీనన్ పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘వ‌చ్చాడు ఘ‌ర్ష‌ణ వెంక‌టేష్ ఈయ‌నొక్క‌డే ఈ లోకాన్ని కాపాడ‌తాడు’ అంటూ ప్ర‌కాష్‌రాజ్‌పై వేసే పంచులు.. ట్రైల‌ర్‌ చివ‌ర్లో ఇప్పుడు ‘ఈయ‌న ఏం చేస్తాడు. బాధ‌తో ఇళ‌యరాజా పాట‌లు వింటుంటాడు’ అంటూ నిత్యా చెప్పే డైలాగులు నవ్వుతెప్పిస్తున్నాయి.

కాగా కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈసినిమాలో ధ‌నుష్‌కు జోడీగా రాశీఖ‌న్నా, ప్రియా భ‌వాని శంక‌ర్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.