
ట్యాగ్ · 98 కథనాలు · పేజీ 5


చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?

మళ్లీ 'ఆచార్య' సెట్ లో చిరు, చరణ్

'చిరు' కి విలన్ గా మాధవన్..!

"భోళా శంకర్ "మూవీ రికార్డ్స్

చిరంజీవి-బాబి సినిమా..పూనకాలు లోడింగ్..!

'భోళా శంకర్' గా మెగాస్టార్

అఫీషియల్.. 'గాడ్ ఫాదర్' గా చిరు

మెగా బ్రదర్స్ సందడి

కొవిడ్ రెస్పాన్స్ ఫండ్ కై చిరంజీవి పిలుపు

కాకినాడ పోర్ట్ లో "లూసిఫర్ "

'లూసిఫర్' రీమేక్.. వివేక్ పాత్రలో సత్యదేవ్..!

స్పెషల్ డే రోజు సినిమా ప్రారంభం..!

చిరంజీవి లేటెస్ట్ లుక్

"లూసిఫర్ "మూవీ రీమేక్ కు ముహూర్తం ఫిక్స్

చిరు సినిమాలో సముద్రఖని..!

'భోళా శంకర్'ను మొదలుపెట్టే ప్లాన్ లో మెహర్ రమేష్
మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. దీనితో పాటు గాడ్ ఫాదర్ సినిమా కూడా చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను దృష్టి పెట్టుకొని స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొద్దిరోజులుగా ఊటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది.

చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం "గాడ్ ఫాదర్"మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్", బాబీ దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా తమిళ సూపర్ హిట్ “వేదాళం" మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్” మూవీ తెరకెక్కనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ లో చిరంజీవి చెల్లెలు గా మహానటి కీర్తి సురేష్ నటిస్తున్నారు.

మళ్లీ 'ఆచార్య' సెట్ లో చిరు, చరణ్
కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తవ్వగా ఇంకా రెండు పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈగ్యాప్ లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్ కూడా పూర్తి కావడంతో శంకర్‌తో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశారు.

'చిరు' కి విలన్ గా మాధవన్..!
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ గా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు డైరెక్టర్ మోహన్ రాజా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

"భోళా శంకర్ "మూవీ రికార్డ్స్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా రూపొందనున్న తమిళ సూపర్ హిట్ “వేదాళం తెలుగు రీమేక్ కు “భోళా శంకర్”టైటిల్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

చిరంజీవి-బాబి సినిమా..పూనకాలు లోడింగ్..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్‌డేట్స్ వరుసపెట్టి ఇస్తున్నారు మేకర్స్. ఒకటి రెండు కాదు నాలుగు సినిమాల పోస్టర్స్, అప్ డేట్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో బాబి దర్శకత్వంలో వస్తున్నసినిమా కూడా ఉంది. . ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్రయూనిట్. పూనకాలు లోడింగ్ అంటూ బాబీ విడుదల చేసిన ఈ పోస్టర్ నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. మాస్ లుక్ తో ఉన్న చిరంజీవి పోస్టర్ ఆకట్టుకుంటుంది. లుంగీ కట్టి.. నోట్లో బీడీ పెట్టి చాాలా రోజుల తరువాత మళ్లీ చిరును మాస్ లుక్ లో చూస్తున్నాం. మళ్లీ పాత చిరంజీవిని చూస్తున్నట్టు ఉంది…

'భోళా శంకర్' గా మెగాస్టార్
ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఆయన సినిమాల నుండి వచ్చే అప్ డేట్స్ కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ కూడా చిరు అభిమానుల కోసం పలు అప్ డేట్స్ తో రెడీ గా ఉన్నారు. దీనిలో భాగంగానే నిన్ననే లూసిఫర్ రీమేక్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశారు. ఈసినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు నిన్ననే ప్రకటించారు.

అఫీషియల్.. 'గాడ్ ఫాదర్' గా చిరు
రేపు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే హడావుడి మొదలైంది. ఇక చిరుతో సినిమాలు తీస్తున్న మేకర్స్ అప్ డేట్స్ తో రెడీ గా ఉన్నారు. రేపు కొంతమంది అప్ డేట్స్ ఇవ్వనుండగా ఒకరోజు ముందుగానే చిరంజీవి లూసిఫర్ రీమేక్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈసినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ నే ఫిక్స్ చేస్తూ చిత్రయూనిట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్ లో బ్లాక్ క్యాప్ పెట్టుకుని…

మెగా బ్రదర్స్ సందడి
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నాయి. చిరు, పవన్ సినిమా షూటింగ్‌లు పక్కపక్కనే జరగడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఇక చిరు ఖైదీ బట్టల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఖాకీ బట్టల్లో ఉండడం విశేషం.

కొవిడ్ రెస్పాన్స్ ఫండ్ కై చిరంజీవి పిలుపు
కరోనా మహమ్మారి తో దేశం అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ , కర్ఫ్యూ లతో జన జీవనం అస్త వ్యస్త మైంది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. ఆక్సిజన్ దొరకక , హాస్పిటల్స్ లో బెడ్స్ అందుబాటులో లేక లక్షలాది మరణాలు సంభవించాయి. వేలాది మంది ఉపాధిని కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశంలోని దాదాపు అన్ని రంగాలు వెనకబడ్డాయి. ఎంతో మంది ఆకలితో అలమటించారు. ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. సెలెబ్రిటీలు సైతం తమ వంతుగా సాయం చేశారు. కరోనా చారిటబుల్ ట్రస్ట్ అంటూ చిరంజీవి గత సంవత్సరం సినిమా కార్మికులను ఆదుకున్నారు.

లూసిఫర్ రీమేక్.. యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి కూడా ఫుల్ స్పీడుమీదున్నారు. అలా ఆచార్య అయిందో లేదో అప్పుడే మరో సినిమాను లైన్ లో కూడా పెట్టేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు హీరోగా లూసిఫర్ రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసి ఫైనల్ గా షూటింగ్ ను షురూ చేశారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. హైద్రాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ నేతృత్వంలో నిర్మించిన భారీ సెట్‌పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది.

కాకినాడ పోర్ట్ లో "లూసిఫర్ "
సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధాన పాత్రలలో రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది.కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కనుంది . లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫస్ట్ సాంగ్‌ను లండన్‌లోని అబ్బేరోడ్ స్టూడియోలో రికార్డ్ చేసినట్టు థమన్ ట్వీట్ చేశారు.

'లూసిఫర్' రీమేక్.. వివేక్ పాత్రలో సత్యదేవ్..!
మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన వచ్చిన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆచార్య సినిమా అయిపోయిన వెంటనే చిరు ఈ సినిమానే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించే నటుల గురించి ఇప్పటికే పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చిరు ఒక్క పాత్ర తప్ప మిగిలిన కీలక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే చిరు జోడిగా నయనతార నటిస్తున్నట్టు ఇప్పటికే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఆతరువాత పృథ్వి రాజ్ పాత్రలో బన్నీ, రానా తో పాటు పలువురి పేర్లే తెరపైకి వచ్చాయి.

స్పెషల్ డే రోజు సినిమా ప్రారంభం..!
మెగాస్టార్ చిరు రీఎంట్రీ తరువాత వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో ముందుగా కొరటాలతో వస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే. అసలు కరోనా లేకపోతే ఈ ఆగష్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా వల్ల ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈసినిమా తరువాత మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టేశారు. ఈసినిమాకోసం భారీ స్థాయిలో సెట్స్ కూడా వేయనున్నట్టు తెలుస్తుంది. ఆ పనులు కూడా ఇప్పటికే మొదలైపోయాయి కూడా.

చిరంజీవి లేటెస్ట్ లుక్
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "ఆచార్య "మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. హీరో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. "ఆచార్య "మూవీ తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ కై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ మూవీ ఆగస్ట్ 12 వ తేదీ నుండి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మూవీ కై ఒక భారీ సెట్ రూపొందుతుంది.

లండన్ లో "లూసిఫర్"రీమేక్ సాంగ్స్ రికార్డింగ్
సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ తెరకెక్కనుంది . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"లూసిఫర్ "మూవీ రీమేక్ కు ముహూర్తం ఫిక్స్
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ , ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ ని తెరకెక్కించనున్నారు.

చిరు సినిమాలో సముద్రఖని..!
మొత్తానికి టాలీవుడ్ లో తమిళ నటీనటులను బాగానే వాడుతున్నారు. ముఖ్యంగా సముద్రఖని లాంటి వారిని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు. పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు సముద్రఖని. ఇక ఇప్పుడు మరో సినిమాలో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరు సినిమాలో. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పనిలో పడ్డాడు. ఈసినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.