రేపు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే హడావుడి మొదలైంది. ఇక చిరుతో సినిమాలు తీస్తున్న మేకర్స్ అప్ డేట్స్ తో రెడీ గా ఉన్నారు. రేపు కొంతమంది అప్ డేట్స్ ఇవ్వనుండగా ఒకరోజు ముందుగానే చిరంజీవి లూసిఫర్ రీమేక్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈసినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ నే ఫిక్స్ చేస్తూ చిత్రయూనిట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్ లో బ్లాక్ క్యాప్ పెట్టుకుని.. చిరంజీవి స్టైల్ గా నిలుచుని ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s the #SupremeReveal of #Chiru153 💥
Unleasing our MIGHTY MEGA STAR @KChiruTweets in & as #𝐆𝐨𝐝𝐅𝐚𝐭𝐡𝐞𝐫 @jayam_mohanraja@AlwaysRamCharan #RBChoudary @ProducerNVP @KonidelaPro @MegaaSuperGood1 @MusicThaman @sureshsrajan @153GodFather #HBDMegastarChiranjeevi pic.twitter.com/BYIdr5CkXQ
— Super Good Films (@SuperGoodFilms_) August 21, 2021
కాగా ఈసినిమాలో సత్యదేవ్ ఇంకా నయనతార నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి… కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వీటితో పాటు బాబి దర్శకత్వంలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: