మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన వచ్చిన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆచార్య సినిమా అయిపోయిన వెంటనే చిరు ఈ సినిమానే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించే నటుల గురించి ఇప్పటికే పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చిరు ఒక్క పాత్ర తప్ప మిగిలిన కీలక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే చిరు జోడిగా నయనతార నటిస్తున్నట్టు ఇప్పటికే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఆతరువాత పృథ్వి రాజ్ పాత్రలో బన్నీ, రానా తో పాటు పలువురి పేర్లే తెరపైకి వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు సత్యదేవ్ ఏ పాత్రలో నటిస్తున్నాడో అన్న దానిపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. లూసిఫర్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నట్టు సమాచారం. మరి ఇది కనుక నిజం అయితే సత్యదేవ్ కు మరో మంచి పాత్ర దక్కినట్టే. ఇక సత్యదేవ్ నటన గురించి తెలిసిందే కాబట్టి ఖచ్చితంగా ఆ పాత్రలో మెప్పిస్తాడని చెప్పొచ్చు.
కాగా ఈసినిమాకు ఈ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఎన్‌వి ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అప్పారావ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా… థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: