
ట్యాగ్ · 19 కథనాలు


'రిపబ్లిక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

సాయి ధరమ్ తేజ్ ఫేవరేట్ హీరోయిన్

ఆన్ లైన్ చీటింగ్.. మెగా హీరో ఫైర్

పులి పిల్లలతో సాయి తేజ్
షూటింగ్ పూర్తి చేసుకున్న సాయి తేజ్ 'రిపబ్లిక్'
'రిపబ్లిక్' రిలీజ్ డేట్ ఫిక్స్
'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ డేట్ ఫిక్స్

#SDT14 - నివేత ప్లేస్ లో ఐశ్వర్యా రాజేష్
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!

#SDT 14 మూవీ అప్ డేట్
మాట నిలబెట్టుకున్న మెగా హీరో
'సోలో బ్రతుకే సో బెటర్' షూటింగ్ పూర్తి
మళ్లీ షూటింగ్ షురూ చేసిన 'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్

'మిస్టికల్ థ్రిల్లర్' గా సాయి తేజ్ కొత్త సినిమా
ఇండిపెండెన్స్ రోజు ఆ జెండాలను వాడుదాం..!

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా సాయి తేజ్ ప్రమాదానికి గురికావడం తో పోస్ట్ పోన్ అయ్యింది. సాయితేజ్ కోలుకోవడం తో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .

'రిపబ్లిక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
సాయి తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాయి తేజ్ ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేని పరిస్థితి ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

సాయి ధరమ్ తేజ్ ఫేవరేట్ హీరోయిన్
సూపర్ హిట్ "పిల్లా నువ్వు లేని జీవితం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ", "సుప్రీమ్ ", "చిత్రలహరి" , "ప్రతి రోజూ పండగే ", "సోలో బ్రతుకే సో బెటర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో సాయి ధరమ్ తేజ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు.

ఆన్ లైన్ చీటింగ్.. మెగా హీరో ఫైర్
టెక్నాలజీ పెరగడంతోపాటు ఆన్ లైన్ మోసాలు కూడా బాగా పెరిగిన సంగతి తెలిసిందే కదా. ఇలాంటి మోసాలు పాల్పడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.. మోసపోయేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇక సెలబ్రిటీల పేరుతో జరిగే మోసాలు అయితే అనేకం. రీసెంట్ గానే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములను ఒక ఆన్ లైన్ స్కామర్ అవార్డ్ వచ్చిందంటూ దానికి రిజిస్టర్ చేసుకోవాలంటూ డబ్బులు ట్రాన్ఫర్ చేయాలంటూ అడుగగా.. వెంకీ కూడా చేశాడు. ఆ తరువాత కానీ అర్ధకాలేదు తను మోసపోయానని.. ఇప్పుడు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమంటున్నాడు మెగాహీరో సాయి తేజ్. అయితే తను మోసపోలేదులే కానీ తన పేరు చెప్పుకొని పాల్పడుతున్నారంటూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాడు.

పులి పిల్లలతో సాయి తేజ్
"చిత్రలహరి ", "ప్రతి రోజూ పండగే ", "సోలో బ్రతుకే సో బెటర్ "వంటి వరస సక్సెస్ ఫుల్ మూవీస్ తో హీరో సాయి తేజ్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో సాయి తేజ్ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ "రిపబ్లిక్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ తో ఆకట్టుకున్న "రిపబ్లిక్ "మూవీ జూన్ 4వ తేదీ రిలీజ్ కానుంది.

'రిపబ్లిక్' తేజ్ లుక్ రిలీజ్ చేసిన చరణ్
ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డ సాయి తేజ్ ఇప్పుడు వరుస హిట్స్ తో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రతీ రోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో వరస హిట్స్ అందుకొని మంచి ఫాంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వాటిలోని లోపాలను చూపించేలా సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న సాయి తేజ్ 'రిపబ్లిక్'
కొంతకాలం ప్లాప్స్ తో సతమతమైన సాయి తేజ్ ఆ తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నాడు. వెంటనే ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల హిట్స్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
'రిపబ్లిక్' రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మెగా స్టార్ ఆచార్య, పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', రామ చరణ్ ఆర్ఆర్ఆర్, వరుణ్ తేజ్ గని, అల్లు అర్జున్ పుష్ప, వైష్ణవ్ తేజ్ ఉప్పెన ఇలా ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక సాయి తేజ్ కొత్త సినిమా కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే లాక్ డౌన్ తీసిన తర్వాత థియేటర్ లో తన మొదటి సోలో బ్రతుకే సో బెటర్ సినిమానే వేసాడు. ఇక ఆ సినిమా కూడా మంచి టాక్ ను, కలెక్షన్స్ ను సొంతం చేసుకొని తర్వాత థియేటర్ లో సినిమా రిలీజ్ చేయాలనుకున్న వారికి మంచి బూస్ట్ ఇచ్చింది.
'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ డేట్ ఫిక్స్
మొత్తానికి థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో చిన్న చిన్నగా సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి కర్చీఫు వేసుకున్నాయి. ఇక త్వరలో క్రిస్మస్ వుంది కాబట్టి ప్రస్తుతం ఈ పండగకు చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే ప్లాన్ లో వున్నాయి. సుమంత్ ప్రధాన పాత్రలో వస్తున్న కపటధారి సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయడానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు మరో సినిమాను కూడా క్రిస్మస్ కు రిలీజ్ చేయడానికి ముహుర్తం ఖరారు చేశారు. ఆ సినిమా ఏదో కాదు మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా.

#SDT14 - నివేత ప్లేస్ లో ఐశ్వర్యా రాజేష్
దేవా కట్టా దర్సకత్వంలో సాయి తేజ్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు సాయి తేజ్, దేవ కట్టా. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న 'సోలో బ్రతుకే సో బెటర్'
సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే ముందు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ముందు కానిచ్చేస్తున్నారు 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్ర యూనిట్. సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ తన ట్విట్టర్ లో తెలిపింది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసిందని.. ‘‘అతి త్వరలో మీ ముందుకు..’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. మరి సినిమా థియేటర్ లో రిలీజ్…
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
మెగా హీరో సాయితేజ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖుల నుండి పుట్టిన రోజులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా సాయి తేజ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే బాయ్ కు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృచ్చికంగా బ్లాక్ బస్టర్ 'బిల్లా రంగా' సినిమా కూడా నేటితో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది.. . ఇది మనకు ఏదో చెబుతోంది అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ.. నువ్వు రెడీయా` అని సాయితేజ్ ఫొటో, `బిల్లా రంగా` సినిమా పోస్టర్‌ను మనోజ్ ట్వీట్ చేశాడు. మరి దీనిపై సాయి తేజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా మంచు మనోజ్, సాయితేజ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.

#SDT 14 మూవీ అప్ డేట్
సూపర్ హిట్ "చిత్రలహరి ", "ప్రతి రోజూ పండగే " మూవీస్ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సాయి తేజ్ హీరోగా "ప్రస్థానం "మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో #SDT 14 మూవీ రూపొందనుంది. నివేత పేతురాజ్ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు . మణిశర్మ సంగీతం అందిస్తున్నారు .
దేవ కట్టా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా సాయి తేజ్
ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
మాట నిలబెట్టుకున్న మెగా హీరో
కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. ఇప్పుడు మరో హీరో కూడా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా హీరో సాయితేజ్. ఇంతకీ ఏం మాట నిలబెట్టుకున్నాడు అనుకుంటున్నారు కదా. అసలు సంగతేంటంటే...
'సోలో బ్రతుకే సో బెటర్' షూటింగ్ పూర్తి
అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో ఇలా షూటింగ్ ను కంప్లీట్ చేసేసారు సోలో బ్రతుకే సో బెటర్ చిత్రయూనిట్. చూడబోతే లాక్ డౌన్ ముందే దాదాపు సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టు కనిపిస్తుంది. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేసింది. సరిగ్గా పది రోజులు షూటింగ్ జరిపారు. ఇక ఇప్పుడు షూటింగ్ పూర్తయినట్టు తెలిపాడు సాయి తేజ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సరదా సరదాగా సాగిన మా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని. సెట్స్ లో ఇంతవరకూ డల్ మూమెంట్ అన్నది లేదు అని తెలిపాడు.
మళ్లీ షూటింగ్ షురూ చేసిన 'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్
సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మధ్యలో షూటింగ్ లకు అనుమతులు వచ్చిన ఎవరు అంత ధైర్యం చేయలేకపోయారు. అయితే దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది. చిత్రబృందం మొత్తం ఈ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

'మిస్టికల్ థ్రిల్లర్' గా సాయి తేజ్ కొత్త సినిమా
రొటీన్ గా ఒకే జోనర్ లో సినిమాలు చేస్తే వర్క్ అవుట్ కాదని మన హీరోలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నాలుగు ఫైట్ లు పాటలు కామెడీ ఉంటే చూసే రోజులు పోయాయి. అందుకే హీరోలు కూడా కొత్త కొత్త జోనర్ లు చేయడానికి ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగానే యంగ్ హీరో సాయి తేజ్ కూడా కొత్త జోనర్.. కొత్త కథతో వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను సాయితేజ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కొత్త జోనర్ లో చేయడం ఎప్పుడూ ఎగ్జైటింగానే ఉంటది. అది కూడా సుకుమార్ లాంటి మూవీ మేకర్ తో అసోసియేట్ అవ్వడం అంటే ఇంకా స్పెషల్ గా ఉంటుంది అని తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ట్వీట్ చేసాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ…
ఇండిపెండెన్స్ రోజు ఆ జెండాలను వాడుదాం..!
కేవలం సినిమాలే కాదు ప్రజలకు అవగాహన కల్పించే విషయాల్లో కూడా మన టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఎప్పుడూ ముందుకొస్తునే ఉంటారు. ఇప్పటికే కరోనాపై తమకు తోచిన సలహాలు, సూచనలు ఇచ్చారు ప్రజలకు. ఇక ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్లాంటబుల్ ఫ్లాగ్ సీడ్‌ను రూపొందించారని, వాటినే జెండాలుగా వాడాలని అందరికీ సూచిస్తున్నారు టాలీవుడ్ సెలెబ్రిటీస్. ఇప్పటికే ఎంతో మంది దీనిపై స్పందించగా... తాజాగా సాయి తేజ్ ట్వీట్ చేస్తూ.. 'ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మనమంతా మన దేశ భక్తిని చాటి చెప్పేందకు బయో డీగ్రేడబుల్ జెండాను వాడుదాం. వాటిని తిరిగి మనం…