#SDT 14 మూవీ అప్ డేట్

SDT14 Movie Team Releases An Interesting Update

సూపర్ హిట్ “చిత్రలహరి “, “ప్రతి రోజూ పండగే ” మూవీస్ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సాయి తేజ్ హీరోగా “ప్రస్థానం “మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో #SDT 14 మూవీ రూపొందనుంది. నివేత పేతురాజ్ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు . మణిశర్మ సంగీతం అందిస్తున్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రూపొందనున్న #SDT 14 మూవీ రెగ్యులర్ షూటింగ్ కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ తో అక్టోబర్ 3 వ వారంలో ప్రారంభం కానుంది. దేవా కట్టా స్క్రిప్ట్ ను అద్భుతంగా రెడీ చేశారనీ , దర్శకుడు దేవా కట్టా తో కొత్త సినిమా ప్రిపరేషన్ వర్క్ ప్రారంభం అయ్యిందనీ , తామిద్దరి ఫొటో ను సాయి తేజ్ ట్విట్టర్ లో షేర్ చేసి, ట్వీట్ చేశారు . హీరో సాయి తేజ్ పొలిటికల్ డ్రామా #SDT 14 మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.