కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

'మిస్టికల్ థ్రిల్లర్' గా సాయి తేజ్ కొత్త సినిమా

Actor Sai Dharam Tej To Act In A Mystical Thriller

'మిస్టికల్ థ్రిల్లర్' గా సాయి తేజ్ కొత్త సినిమా

Actor Sai Dharam Tej To Act In A Mystical Thriller

Actor Sai Dharam Tej To Act In A Mystical Thriller

రొటీన్ గా ఒకే జోనర్ లో సినిమాలు చేస్తే వర్క్ అవుట్ కాదని మన హీరోలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నాలుగు ఫైట్ లు పాటలు కామెడీ ఉంటే చూసే రోజులు పోయాయి. అందుకే హీరోలు కూడా కొత్త కొత్త జోనర్ లు చేయడానికి ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగానే యంగ్ హీరో సాయి తేజ్ కూడా కొత్త జోనర్.. కొత్త కథతో వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను సాయితేజ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కొత్త జోనర్ లో చేయడం ఎప్పుడూ ఎగ్జైటింగానే ఉంటది. అది కూడా సుకుమార్ లాంటి మూవీ మేకర్ తో అసోసియేట్ అవ్వడం అంటే ఇంకా స్పెషల్ గా ఉంటుంది అని తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ట్వీట్ చేసాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరి పోస్టర్ చూస్తుంటే మాత్రం ఈసారి డిఫరెంట్ గానే వస్తున్నట్టు అర్ధమవుతుంది.

ప్రస్తుతం సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాతో పాటు ఇటీవలే మరో సినిమాను లైన్ లో పెట్టాడు సాయి తేజ్. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్ కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.

కాగా కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకున్న సాయి తేజ్ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇక రీసెంట్ గా ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజు పండగే’ సినిమాలతో హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. మరి ఈ సినిమాలు సాయి తేజ్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తాయో చూద్దాం.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్