‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ పూర్తి

Solo Brathuke So Better Movie Team Wraps Up Shooting Work

అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో ఇలా షూటింగ్ ను కంప్లీట్ చేసేసారు సోలో బ్రతుకే సో బెటర్ చిత్రయూనిట్. చూడబోతే లాక్ డౌన్ ముందే దాదాపు సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టు కనిపిస్తుంది. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ చేసింది. సరిగ్గా పది రోజులు షూటింగ్ జరిపారు. ఇక ఇప్పుడు షూటింగ్ పూర్తయినట్టు తెలిపాడు సాయి తేజ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సరదా సరదాగా సాగిన మా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని. సెట్స్ లో ఇంతవరకూ డల్ మూమెంట్ అన్నది లేదు అని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మే లోనే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు సాయి తేజ్. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్ కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. దీనితోపాటు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమా కూడా చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =