ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాతో పాటు దేవా కట్టా సినిమా కూడా లైన్ లో పెట్టాడు సాయి తేజ్. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్ కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు సాయి తేజ్, దేవ కట్టా. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు సాయి తేజ్. దేవ కట్టతో కలిసి ప్రీప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటున్న ఫొటో ఒకదాన్ని షేర్ చేసి 14వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నామని, దేవ కట్ట కథను గొప్పగా రాశారని, సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని పోస్ట్ పెట్టారు.
Intense Prep work started for #SDT14 @devakatta garu nailing it with his writing…raring to go on set 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/930VgwawnP
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 6, 2020
ఈ సినిమాతో పాటు కార్తీక్ దండు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: