
ట్యాగ్ · 41 కథనాలు · పేజీ 2


ఫ్యాక్షన్ లీడర్ గా హీరో రామ్

"ఇస్మార్ట్ శంకర్ " హిందీ వెర్షన్ రికార్డ్

తాత మరణంపై రామ్ ఎమోషనల్

రామ్ 19 సినిమాకు డీఎస్పీ

రామ్‌తో 'జగడం' రీమేక్ చేయాలని ఉంది
'రామ్19' లో కృతి శెట్టి..!
'రామ్19' కన్ఫామ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్
చిన్న బ్రేక్ అంటున్న రామ్

ఫ్రెష్ లుక్ లో హీరో రామ్
హీరో రామ్ కు మరోసారి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?

హీరో రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లుక్

పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?
రామ్ మిర్రర్ సెల్ఫీ
"RED " మూవీ దీపావళికి థియేటర్స్ లో రిలీజ్ ?
'రెడ్' సినిమా - డబ్బింగ్ పూర్తి చేసిన రామ్
రామ్-సంతోష్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి..?
హ్యాపీ బర్త్ డే జెన్నూ
హ్యాపీ బర్త్ డే - నా ఓటు నీకే బ్రదర్

'రామ్' సినిమాలో నటించట్లేదు
ప్రస్తుతం రామ్ తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో కనిపించనున్నాడు. గత నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ప్రారంభం కాలేదు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

ఫ్యాక్షన్ లీడర్ గా హీరో రామ్
సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో రామ్ పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"ఇస్మార్ట్ శంకర్ " హిందీ వెర్షన్ రికార్డ్
పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నభా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలు. హీరో రామ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన "ఇస్మార్ట్ శంకర్ "మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.మణిశర్మ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

తాత మరణంపై రామ్ ఎమోషనల్
ఇప్పటికే కరోనావల్ల ఎంతోమంది సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇక ఇప్పుడు మరో నిర్మాతకు పితృవియోగం కలగగా.. అలాగే స్టార్ హీరో తాతను కోల్పోయాడు. ఆ నిర్మాత ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ కాగా ఆ స్టార్ హీరో రామ్ పోతినేని. హీరో రామ్ పోతినేని ఫ్యామిలీలో విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న రామ్ తాతయ్య ఈరోజు మరణించారు.

రామ్ 19 సినిమాకు డీఎస్పీ
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

బోయపాటి దర్శకత్వంలో రామ్ ?
సూపర్ హిట్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అభిమానులు ఎనర్జిటిక్ స్టార్ గా పిలుచుకునే హీరో రామ్ లవర్ బాయ్ ఇమేజ్ నుండి పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన "ఇస్మార్ట్ శంకర్ "మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

రామ్‌తో 'జగడం' రీమేక్ చేయాలని ఉంది
కొన్ని సినిమాలు హిట్ కాకపోవచ్చేమో కానీ వాటికి మాత్రం స్పెషల్ గా గుర్తింపు ఉంటుంది. ఆ లిస్ట్ లో సుకుమార్ సినిమా జగడం కూడా ఉంటుంది. సుకుమార్ ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ తరువాత, రామ్ దేవదాస్ బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వచ్చిన సినిమా జగడం. ఇద్దరికీ ఈసినిమా నిరాశనే మిగిల్చినా కూడా మంచి కల్ట్ మూవీ అని ఇప్పటికీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తారు. ఈ సినిమా నచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఈ చిత్రం విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుకుమార్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలుచెప్పాడు. ఎంతో ప్రేమతో తాను జగడం సినిమా తీసినట్లు గుర్తు చేసుకున్నాడు.
'రామ్19' లో కృతి శెట్టి..!
ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే కృతి శెట్టికి వరుస అవకాశాలు తలుపుతట్టాయి. మరి సినిమా రిలీజ్ అయి.. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్కొట్టి.. అందులోనూ నటనలో వందకు వంద మార్కులు పడితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు కృతి శెట్టి పరిస్థితి కూడా అదే. ఉప్పెన ఘన విజయంతో ఈ భామకు అవకాశాలు కూడా ఉప్పెనలా వస్తున్నాయి. ఇప్పటికే నాని సరసన ‘శ్యామ్‌సింగరాయ్’ చిత్రంలో ఓ నాయికగా నటిస్తున్న ఈ భామ, సుధీర్‌బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కూడా కథానాయికగా ఖరారైంది. ఇప్పుడు మరో సినిమాలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది.
'రామ్19' కన్ఫామ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్
ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్న.. మళ్లీ కలుద్దాం అని ఎనర్జిటిక్ హీరో రామ్ చెప్పగా చాలా ఎక్కువ గ్యాప్ తీసుకునేలాగానే ఉన్నాడు.. ఇప్పుడప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ రాదులే అని ఫ్యాన్స్ తో సహా అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే అందరికీ షాకిస్తూ తన కొత్త సినిమా అప్ డేట్ తో వచ్చేసాడు. గత కొద్దికాలంగా రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి తో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది.
చిన్న బ్రేక్ అంటున్న రామ్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చి ఇటీవల విడుదలైన 'రెడ్' సినిమాతో మరోహిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఇక తన తర్వాత సినిమా గురించిన అప్ డేట్ ఇంకా ఇవ్వలేదు. మరోవైపు అభిమానులు తమ హీరో ఎవరితో చేస్తాడో.. దానికి సంబంధించిన అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కు రామ్ చిన్న షాకే ఇచ్చాడు.

ఫ్రెష్ లుక్ లో హీరో రామ్
"దేవదాసు ", "రెడీ ", "కందిరీగ ", "పండగ చేస్కో ", "నేను శైలజ ", "హలో గురు ప్రేమకోసమే " వంటి సూపర్ హిట్ మూవీస్ లో రామ్ పోతినేని తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ లా ఉండే హీరో రామ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మాస్ క్యారెక్టర్ లో పక్కా హైదరాబాదీ యువకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
హీరో రామ్ కు మరోసారి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?
సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ప్రేమమ్ "," శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ", రాక్షసుడు" వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. స్లిమ్ గా మరింత అందంగా మారిన అనుపమ ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18పేజెస్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి కథానాయిక గా ఎంపిక అయ్యారని సమాచారం.

హీరో రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లుక్
"ఇస్మార్ట్ శంకర్ "విజయోత్సాహం లో ఉన్న హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నిజ సంఘటనలతో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ సంక్రాంతి కి రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. మణి శర్మ సంగీతం అందించారు. కొవిడ్ - 19 కారణంగా "RED " మూవీ రిలీజ్ వాయిదాపడింది.

పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?
వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ , ఇలియానా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "దేవదాసు "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హీరో రామ్ , హీరోయిన్ ఇలియానా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చక్రి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
రామ్ మిర్రర్ సెల్ఫీ
బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయిన రామ్ పోతినేని ఆ మూవీ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రెడీ ", "కందిరీగ ", "పండగ చేస్కో ", "నేను శైలజ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మాస్ క్యారెక్టర్ లో రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా జీ సినీ అవార్డ్ అందుకున్నారు.
"RED " మూవీ దీపావళికి థియేటర్స్ లో రిలీజ్ ?
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర లలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సూపర్ హిట్ "తడమ్ "తమిళ మూవీ కి తెలుగు రీమేక్ గా "RED " మూవీ రూపొందింది.
'రెడ్' సినిమా - డబ్బింగ్ పూర్తి చేసిన రామ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. రామ్ తన డబ్బింగ్ పూర్తి చేసినట్టు తన ఇన్స్టా ద్వారా తెలిపాడు.
రామ్-సంతోష్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి..?
పలు సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసి 'కందిరీగ' సినిమాతో డైరెక్టర్ గా మారాడు సంతోష్ శ్రీనివాస్. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తీసిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీనే ఈ సినిమాకు ప్రధాన బలం. దానికి తగ్గట్టే ఈ సినిమాలో రామ్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో హైపర్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఇక ఇప్పుడు ముచ్చట మూడోసారి కాంబినేషన్ రిపీట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
హ్యాపీ బర్త్ డే జెన్నూ
హీరో రామ్, జెనీలియా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. 2008లో వచ్చిన ‘రెడీ’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటినుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ రోజు జెనీలియా పుట్టిన రోజు కావడంతో తన ట్విట్టర్ వేదికగా ఆమెకు బర్త్‌డే విషేస్ తెలిపాడు రామ్. ‘ఎవరైనా ఏది కావాలన్నా అడగగలిగే సెల్ఫ్ లెస్ మరియు కేరింగ్ ఫ్రెండ్ నువ్వు.. హ్యాపీ బర్త్ డే జెన్నూ. రానున్న సంవత్సరాలు మరింత ఉత్తమంగా ఉండాలని ఆశిస్తున్నాను. త్వరలోనే ఇదే రోజున మనందరం మరోసారి కలుసుకుందాం’ అంటూ ట్వీట్ చేశారు రామ్. అంతేకాక జెనీలియా కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. దీనిలో జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్…
హ్యాపీ బర్త్ డే - నా ఓటు నీకే బ్రదర్
రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి బాసటగా నిలిచాడు. దీనితో సోనూసూద్ రియల్ హీరో అంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సోనూసూద్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.