పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నభా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలు. హీరో రామ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన “ఇస్మార్ట్ శంకర్ “మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.మణిశర్మ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పక్కా తెలంగాణ యాసలో కొత్తగా ఉన్న సంభాషణలు, రామ్ డైలాగ్ డెలివరీ, ఫుల్ ఎనర్జీతో సాగే రామ్ యాక్టింగ్ అండ్ స్టెప్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి . అక్కడక్కడా నవ్విస్తూనే హీరో రామ్ తన హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేసి మాస్ ఆడియెన్స్ ను అలరించారు. హీరోయిన్స్ గా నటించిన నభా నటేష్ , నిధి అగర్వాల్ తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో మరియు తమ గ్లామర్ తో బాగా అలరించారు. 2020 సంవత్సరం ఫిబ్రవరి లో “ఇస్మార్ట్ శంకర్ “హిందీ డబ్బింగ్ వెర్షన్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయగా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ఇస్మార్ట్ శంకర్ “హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ , 1. 9 మిలియన్ లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో రామ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు సౌత్ ప్రేక్షకులే కాదు నార్త్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























