ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే కృతి శెట్టికి వరుస అవకాశాలు తలుపుతట్టాయి. మరి సినిమా రిలీజ్ అయి.. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్కొట్టి.. అందులోనూ నటనలో వందకు వంద మార్కులు పడితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు కృతి శెట్టి పరిస్థితి కూడా అదే. ఉప్పెన ఘన విజయంతో ఈ భామకు అవకాశాలు కూడా ఉప్పెనలా వస్తున్నాయి. ఇప్పటికే నాని సరసన ‘శ్యామ్‌సింగరాయ్’ చిత్రంలో ఓ నాయికగా నటిస్తున్న ఈ భామ, సుధీర్‌బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కూడా కథానాయికగా ఖరారైంది. ఇప్పుడు మరో సినిమాలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ కు జోడీగా కృతి శెట్టి నటించనున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ ఈ సినిమాలో తన పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా బావుందని.. అందుకే కృతి ఈ పాత్రకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషలలో రూపొందించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనుండగా… ఈ సినిమాలో నటించే నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: