‘రామ్19’ కన్ఫామ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్

Ram Pothineni Next Movie RAPO19 Official Announcement Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ram Pothineni,Hero Ram Pothineni,Actor Ram Pothineni,Ram Pothineni Next Movie,Ram Pothineni Next Movie Announcement,Ram Pothineni Next Movie Official Announcement,RAPO19 Official Announcement,RAPO19 Announcement,Ram Pothineni Next Movie RAPO19,Ram Pothineni Next Movie RAPO19 Announcement,RAPO19 Confirmed,RAPO19 News,Ram Pothineni Upcoming Movie RAPO19,Ram Pothineni Next Movie RAPO19 Confirmed,Lingusamy,RAPO,Ram Pothineni Next Announced,Ram Pothineni 19th Movie,Ram Pothineni 19th Movie Confirm,Ram Pothineni New Movie,Ram Pothineni Latest News,#RAPO19

ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్న.. మళ్లీ కలుద్దాం అని ఎనర్జిటిక్ హీరో రామ్ చెప్పగా చాలా ఎక్కువ గ్యాప్ తీసుకునేలాగానే ఉన్నాడు.. ఇప్పుడప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ రాదులే అని ఫ్యాన్స్ తో సహా అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే అందరికీ షాకిస్తూ తన కొత్త సినిమా అప్ డేట్ తో వచ్చేసాడు. గత కొద్దికాలంగా రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి తో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా రామ్ తన 19 సినిమాను అధికారికంగా ప్రకటించాడు. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితోనే తర్వాత సినిమా ఉంటుందని ప్రకటించాడు. సిల్వ‌ర్ స్కీన్ ప‌తాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందించ‌నున్నారు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనుండగా… ఈ సినిమాలో నటించే నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

మరి ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ మసాలా సినిమా తీసిన రామ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఆ తరువాత జానర్ మార్చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ అయినా రెడ్ సినిమాను పట్టాలెక్కించాడు. అది కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అల‌రించిన లింగుస్వామి గతకొద్దికాలంగా సరైన హిట్ కొట్టలేదు. ఒక రకంగా చెప్పాలంటే త‌మిళ హీరోలు సైతం లింగు స్వామిని పక్కన పెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో మంచి ఫామ్ లో రామ్ లింగు స్వామికి అవకాశం ఇవ్వడం గ్రేటే. మరి లింగు స్వామి ఈసారి మంచి హిట్ కొడతాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 13 =