గత ఏడాది సంచలన విజయం సాధించిన `భరత్ అనే నేను`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కియరా అద్వాని. మొదటి తెలుగు సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు… సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన పర్‌ఫెక్ట్ జోడీ అనిపించుకుందీ ఉత్తరాది భామ. ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన `వినయ విధేయ రామ`లోనూ తన గ్లామర్‌తో మురిపించింది కియరా. ఇదిలా ఉంటే… ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న కియరా… అతి త్వరలో మరో తెలుగు సినిమాలో నటించబోతోందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… అక్కినేని వారి మూడో తరం కథానాయకుడు అఖిల్ హీరోగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. కాగా… ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా కియరా నటించబోతోందని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. త్వరలోనే కియరా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: