`వెంకీ మామ‌` తాజా షెడ్యూల్ ఎప్పుడంటే…

2019 Latest Telugu Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh and Naga Chaitanya Venky Mama Movie Shooting News, Venky Mama Movie Latest Shooting Updates, Venky Mama Movie Latest Updates, Venky Mama Movie New Shooting Schedule, Venky Mama Movie Next Schedule Update, Venky Mama Telugu Movie Latest News
Venky Mama Movie Next Schedule Update

`ఎఫ్ 2` ఘ‌న‌విజ‌యం సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న మేన‌ల్లుడు అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో `వెంకీ మామ‌` పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ప‌వ‌ర్‌`, `స‌ర్ధార్ గ‌బ్బర్ సింగ్‌`, `జై ల‌వ కుశ‌` చిత్రాల ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) రూపొందిస్తున్న ఈ సినిమాలో వెంక‌టేష్‌కి జోడీగా పాయ‌ల్ రాజ్ పుత్ న‌టిస్తుండ‌గా… నాగ‌చైత‌న్య‌కి జంట‌గా రాశి ఖ‌న్నా క‌నిపించ‌నుంది. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్త‌య్యింది. ఈ నేప‌థ్యంలో… రెండో షెడ్యూల్‌ని ఈ నెల చివ‌రి వారంలో ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిసింది. కాగా… ఈ సినిమాలో రైస్ మిల్ ఓన‌ర్ పాత్ర‌లో వెంకీ క‌నిపించ‌నుండ‌గా… ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో నాగ‌చైత‌న్య ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. ద‌స‌రా కానుక‌గా `వెంకీ మామ‌` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=a8jLt8-NJCI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =