రచయితగానూ, దర్శకుడిగానూ, నటుడిగానూ… తెలుగు పరిశ్రమలో తనదైన సంతకం చేశాడు పోసాని కృష్ణమురళి. దాదాపు పాతికేళ్ళుగా వెండితెరపై పలు విభిన్న పాత్రల్లో అలరించిన పోసాని… ఎక్కువగా లౌడ్ కామెడీ రోల్స్ లోనే సందడి చేశాడు. అయితే… ఇందుకు భిన్నంగా పూర్తిస్థాయి శాంతపరుడి పాత్రలో ఆయన కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ `చిత్రలహరి` పేరుతో ఓ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్‌కి తండ్రిగా పోసాని కృష్ణమురళి కనిపించనున్నాడట. ఇప్పటివరకు ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ పోషించిన పాత్రలకు భిన్నంగా… సౌమ్యంగా సాగే పాత్ర ఇదని సమాచారం. అలాగే సినిమాలోని హైలెట్స్‌లో ఒకటిగా… ఈ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. మరి సరికొత్త పాత్రలో పోసాని ఏ మేరకు ఆకట్టుకుంటాడో తెలియాలంటే… ఏప్రిల్ 12 వరకు వేచిచూడాల్సిందే.
[youtube_video videoid=03Mk3HEzRdM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: