స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అనుకుంటున్న దగ్గర నుండి షూటింగ్ విషయంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. సినిమా ప్రారంభమైనా రెగ్యులర్ షూటింగ్ మాత్రం అనుకున్నట్టు జరగడం లేదు. దీంతో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక దానిపై స్పందించిన చిత్రయూనిట్ అదేం లేదు షూటింగ్ జరుగుతుంది అంటూ పుకార్లను ఖండించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా లేట్ అవ్వడానికి కూడా ఇప్పటి వరకూ పలు కారణాలే విన్నాం. అయితే అసలు కారణం వేరే ఉందట. నిజానికి ఈ సినిమాలో కమల్ గెటప్పే హైలెట్. వృద్ద వయసులో ఉన్న కమలే సినిమాకు ప్లస్ పాయింట్. మరి అలాంటి కమల్ రావాలంటే ఎంత మేకప్ వేయాలి. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చిందట. ఈ మేకప్ వల్ల కమల్ కు స్కిన్ అలర్జీ వచ్చిందట. దాంతో కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడిందట. ఆతరువాత మళ్లీ షూటింగ్ లో పాల్గొనగా.. రెండో సారి కూడా మేకప్ వేసిన వెంటనే అలర్జి రావడంతో ఈ సినిమా లేట్ అవుతుందట. మరి ఈ వార్తలను చిత్రయూనిట్ ఖండిస్తుందో? లేదో? చూద్దాం.
కాగా ఈసినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. శింబు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో చేయనున్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[youtube_video videoid=jA0xiSGBGQs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: