`శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `రంగస్థలం` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. అయితే… ఆ తరువాత వచ్చిన `సవ్యసాచి`, `అమర్ అక్బర్ ఆంటొని` చిత్రాలు ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో… ఈ బేనర్ నుంచి వస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ `చిత్రలహరి`పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల రూపొందిస్తున్న ఈ సినిమా… వేసవి కానుకగా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయేమిటంటే… మైత్రీ మూవీ మేకర్స్ కి హ్యాట్రిక్ విజయాలను అందించిన మూడు చిత్రాలకూ స్వరాలందించిన దేవిశ్రీ ప్రసాద్… స్వల్ప విరామం తరువాత మళ్ళీ ఈ సినిమాకి బాణీలనందిస్తున్నాడు. అంతేకాదు… ఇప్పటికే టీజర్‌తో ఆసక్తి రేకెత్తించిన `చిత్రలహరి`కి దేవిశ్రీ ప్రసాద్… వినసొంపైన పాటలను అందించాడని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. మరి… మైత్రీ మూవీ మేకర్స్‌కి దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాక్టర్ మరోసారి వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
[youtube_video videoid=EzblxkFoyX8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: