గొప్ప మనసు చాటుకున్న మనోజ్

Manchu Manoj - A Man With Golden Heart,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manchu Manoj Adopted Ashwitha,Manchu Manoj Win the Fans Heart,Manchu Manoj Takes Ashwitha Responsibility,Manchu Manoj Adopted a Girl on Mohan Babu Birthday Special,Manchu Manoj Special News on Mohan Babu Birthday Special
Manchu Manoj - A Man With Golden Heart

కేవలం సినిమా విషయాలే కాదు… సామజిక, రాజకీయ అంశాలపై కూడా మంచు మనోజ్ తన అభిప్రాయాలని ప్రజలతో పంచుకుంటుంటాడు. పలు విషయాలపై తన ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంటారు. అంతేకాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూనే ఉంటాడు. అలాంటి మనోజ్ తాజాగా ఓ మంచి పని చేసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ రోజు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తండ్రి మోహన్ బాబు 69వ పుట్టినరోజును పురస్కరించుకుని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నాడు మనోజ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి అందరికీ తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నాన్న పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాను. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు’ చెప్పారు. ఆ అమ్మాయిని విద్యానికేతన్ స్కూల్ లో జాయిన్ చేసినట్లు, తన భాద్యతలన్నీ కూడా నేనే తీసుకుంటానని చెప్పాడు. మంచి చదువు చెప్పిస్తానని, జాగ్రత్తగా చూసుకుంటానని వెల్లడించాడు. ఐఏఎస్ అధికారి అవ్వాలనేది ఆమె ఆశయమని, తను అనుకున్నది సాధించే వరకు సాయపడతానని తెలిపారు.

 


ఇక సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మంచు మనోజ్ తీసుకున్న ఈనిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=rfygHI-PQE4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 17 =