అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున, సోనాలి బెంద్రే జంటగా K విజయ భాస్కర్ దర్శకత్వం లో రూపొందిన మన్మథుడు మూవీ 2002 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున హీరోగా మన్మథుడు మూవీ సీక్వెల్ మన్మథుడు -2 మూవీ, చి ల సౌ వంటి ఫీల్ గుడ్ మూవీ ని రూపొందించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలో ప్రారంభం కానున్న మన్మధుడు- 2 మూవీ కి సంగీత దర్శకుడిగా బ్లాక్ బస్టర్ మూవీ RX 100 ద్వారా సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన చైతన్ భరద్వాజ్ ఎంపిక అయ్యారు. RX 100 మూవీ లో చైతన్ భరద్వాజ్ స్వర పరిచిన పిల్లా రా సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి వద్ద కీ బోర్డ్ ప్లేయర్ గా పనిచేసిన చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన సంగీతం
RX 100 మూవీ సక్సెస్ కు హెల్ప్ అయింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న మన్మథుడు -2 మూవీ ద్వారా నాగార్జున మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
[youtube_video videoid=ruEcJyx3c3M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: