
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 53


సల్మాన్ మూవీలో అలీ

ఎమోషనల్ ఏప్రిల్ - ఎమోషనల్ హిట్స్

అయోగ్య ట్రైలర్ రిలీజ్

పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’కి 19 ఏళ్ళు

ఏడాది పూర్తిచేసుకుంటున్న ‘భరత్ అనే నేను’

నాగార్జున ‘హలోబ్రదర్..’కి పాతికేళ్ళు

నానిపై తారక్ ప్రశంసలు

మెగాస్టార్ తో కల నిజమైనవేళ!

సోషల్ మెసేజ్ మూవీ లో జయం రవి

అప్పుడు`సుప్రీమ్`... ఇప్పుడు `చిత్రలహరి`

`బ్రహ్మోత్సవం` రీమేక్ కానుందా?

అల్లు అర్జున్ మూవీ లో బహు భాషా నటులు

మెగా హీరో చిత్రంలో కేరళకుట్టి?

సస్పెన్స్ థ్రిల్లర్ సెవెన్ మూవీ షూటింగ్ పూర్తి
హవీష్ కథానాయకుడిగా.. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ సెవెన్. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో నటిస్తున్న ఒక్కోక్కరి పాత్రను ఒక్కో పోస్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ ఆ ఆసక్తిని ఇంకా పెంచింది చిత్రయూనిట్. దీంతో ఈ థ్రిల్లర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

'ఎవరెస్ట్ అంచున' లిరికల్ సాంగ్ రిలీజ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం మహర్షి. మే 9న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆరు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి రికార్డ్ సాధించింది. ఇక ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో భాగంగానే పూజా హెగ్డే, హీరో మహేష్‌పై చిత్రీకరించిన ‘ఎవరెస్ట్ అంచున’ డ్యూయెట్ సాంగ్ వీడియో ప్రివ్యూ ను నిన్న రిలీజ్ చేయగా.. ఈ పాట కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈరోజు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చిన్మయి శ్రీపాద, డీఎస్పీ ఈ గీతాన్ని…

సల్మాన్ మూవీలో అలీ
చిన్నప్పటి నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కమెడియన్ కమ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది అలీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, హీరో ఎన్నో సినిమాల్లో నటించి… మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ. అయితే ప్రస్తుతం కొత్త కొత్త కమెడియన్లు వస్తున్న నేపథ్యంలో కాస్త సినిమాలు అవశాలు తగ్గినా.. బుల్లి తెరపై మాత్రం సందడి చేస్తూనే ఉన్నాడు.

ఎమోషనల్ ఏప్రిల్ - ఎమోషనల్ హిట్స్
చకోర పక్షి వర్షం కోసం ఎలా ఎదురచూస్తుందో.. అలా మన ఇండస్ట్రీ గత కొద్ది రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ఒక్క ఎఫ్ 2 మినహా పెద్ద సినిమాలు సహా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తరువాత ఫిబ్రవరిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇక మార్చిలో 118 సినిమా కాస్త ఊరట నిచ్చింది. ఏడాది ప్రారంభమైన నాలుగు నెలల్లో కేవలం రెండు సినిమాలు తప్పితే తెలుగు ఇండస్ట్రీకి చెప్పుకోతగ్గ హిట్టే దక్కలేదు.

నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ - ఫస్ట్ డే కలెక్షన్స్
మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నచించిన జెర్సీ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈసినిమాలో నాని నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఒక క్రికెటర్‌గా, ప్రేమికుడిగా,సగటు భర్తగా, తండ్రిగా నాని నటనను అందరు మెచ్చుకుంటున్నారు. దీంతో విమర్శకుల ప్రశంసలతో పాటు… పలువురు టాలీవుడ్ అగ్ర నటులు నుండి కూడా ప్రశంసలు అందాయి. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్సే రాబట్టింది. నాని కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

అయోగ్య ట్రైలర్ రిలీజ్
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'టెంపర్' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’కి 19 ఏళ్ళు
డైరెక్టర్ కావడానికి ఎన్నో కష్టాలు పడుతూ తిరుగుతున్న రోజులవి. చేతికొచ్చిన సినిమాలు ఒక్కోటి ఆగిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం. గురువు కృష్ణవంశీ ఒకే మాట చెప్పాడు… “నీలోని టాలెంట్‌ను గుర్తించే హీరోతో సినిమా చెయ్” అని. కాని మనసులో ఒకటే ప్రశ్న… “నాలోని టాలెంట్ గుర్తించే హీరో ఎవరు?”… వెంటనే వినిపించిన సమాధానం “పవన్ కళ్యాణ్”. ఆ సినిమా రెడీ. అదే ‘బద్రి’. రిజల్ట్… బ్లాక్ బస్టర్ హిట్. ఆ దర్శకుడెవరో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. యస్… పూరీ జగన్నాథ్. దర్శకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తొలి చిత్రమది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు పూరి. దర్శకుడిగా…

ఏడాది పూర్తిచేసుకుంటున్న ‘భరత్ అనే నేను’
నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకుడి లక్షణం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఇందులో… “ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి” అంటూ తన పరిపాలనా దక్షతతో ప్రజల మన్ననలు పొందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఆద్యంతం అలరించాడు. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.

నాగార్జున ‘హలోబ్రదర్..’కి పాతికేళ్ళు
“హీరోలయందు మాస్ హీరోలు వేరయా” అన్నట్టుగా… ప్రతీ కథానాయకుడు మాస్ హీరో అనిపించుకోవాలని తాపత్రయపడతాడు. ఒక్కసారి మాస్ హీరోగా ప్రేక్షకుల ఆదరణ పొందితే… ఆ చిత్రం ప్రేక్షకులకు చేరువైతే… ఆ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన మ..మ.. మాస్ చిత్రమే కింగ్ నాగార్జున డ్యూయెల్ రోల్స్‌లో నటించిన ‘హలోబ్రదర్..’.

ఒక క్రికెట్ ప్లేయర్ ఎమోషనల్ జర్నీ "జెర్సీ"
ఇక డిఫరెంట్ అటెంప్ట్ గా అభినందనలు అందుకుంటున్న "జెర్సీ"లో ప్లస్ ల మైనస్ ల విభజన, విశ్లేషణ అనవసరం. అక్కడక్కడ మందగించిన వేగం, ఇంకొంచెం హిలేరియస్ గా నరేట్ చేయలేకపోవటం మినహా అన్ని విధాల అలరించే డిఫరెంట్, డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఫిలిం "జెర్సీ".

నానిపై తారక్ ప్రశంసలు
ఎన్నో అంచనాల మధ్య జెర్సీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంత చేసుకుంది. కేవలం టాక్ ను మాత్రమే కాదు.. ఈ సినిమాలో నాని నటనకు గాను.. గౌతమ్ సినిమాను తెరకెక్కించిన విధానానికి గాను విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్జున్ పాత్రలో నాని ఒదిగిపోయాడని.. ఆ పాత్రలో అతడిని తప్ప మరెవరినీ ఊహించుకోలేం అంటూ సినిమాను చూసిన అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మహర్షి నుండి ఎవరెస్ట్ అంచున వీడియో సాంగ్ రిలీజ్
మహేష్ బాబు నటిస్తున్న సిల్వర్ జూబ్లీ సినిమా మహర్షి కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వారి ఎదురుచూపులకు ఊరటగా.. రోజుకో సర్ ప్రైజ్ ఇస్తూ మహేష్ తన అభిమానులను హ్యాపీ చేస్తూనే ఉన్నాడు. ఇక గత కొద్ది కాలంగా జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ కు కూడా నిన్ననే కొబ్బరికాయ కొట్టారు చిత్ర యూనిట్.

కాంచన 3 రివ్యూ - మరోసారి భయపెట్టిన లారెన్స్
ఓవరాల్ గా ఈసినిమా హార్రర్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే కాదు..అన్ని వర్గాల వారికి నచ్చుతుందని చెప్పొచ్చు.

మెగాస్టార్ తో కల నిజమైనవేళ!
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇలా ఎంతో మంది ప్రముఖ నటులు నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమాలో చరణ్ దీప్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు.

సోషల్ మెసేజ్ మూవీ లో జయం రవి
కోలీవుడ్ లో స్టార్ హీరో గా వెలుగొందుతున్న జయం రవి సిల్వర్ జూబ్లీ మూవీ ఒక సోషల్ మెసేజ్ తో రూపొందనుంది. నిర్మాత సుజాత విజయ్ కుమార్ (జయం రవి మదర్ ఇన్ లా ) నిర్మాణ సారథ్యం లో హిట్ మూవీస్ రోమియో జూలియట్, బోగన్ చిత్రాల దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వం లో జయం రవి 25 వ మూవీ రూపొందనుంది.

అప్పుడు`సుప్రీమ్`... ఇప్పుడు `చిత్రలహరి`
‘పిల్లా నువ్వులేని జీవితం’తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు మెగా హీరో సాయి తేజ్. అనంతరం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ సినిమాలతో మెగాభిమానులను అలరించి… అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే… ఆ తర్వాత వచ్చిన ‘తిక్క’, ‘విన్నర్’, ‘నక్షత్రం’, ‘జవాన్’, ‘ఇంటిలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమాలు ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో… వేసవి సందర్భంగా (ఏప్రిల్ 12) విడుదలైన తాజా చిత్రం ‘చిత్రలహరి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసాడు ఈ మెగాహీరో.

`బ్రహ్మోత్సవం` రీమేక్ కానుందా?
ఒక్కోసారి కాన్సెప్ట్ బాగున్నా… బ్యాడ్ ఎగ్జిక్యూషన్ కారణంగా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటి చిత్రాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రహ్మోత్సవం ఒకటి.

అల్లు అర్జున్ మూవీ లో బహు భాషా నటులు
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందే మూవీ పూజా కార్యక్రమం ఇటీవలే జరుపుకొన్న విషయం తెలిసిందే . ఏప్రిల్ 24 వ తేదీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూజా హెగ్డే కథానాయిక కాగా థమన్ SS సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ హిట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ లోని ముఖ్య పాత్రలకు దేశ వ్యాప్తం గా గుర్తింపు ఉన్న నటీ నటులను దర్శకుడు త్రివిక్రమ్ సెలెక్ట్ చేశారు.

బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో ముచ్చటగా మూడోసారి
సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక్కోసారి ఆ సెంటిమెంట్స్తోనే విజయాలు కూడా వరిస్తుంటాయి. అలా… తమ కాంబినేషన్ సినిమాలకు కలిసొచ్చిన ఓ సెంటిమెంట్‌ని మరోసారి రిపీట్ చేయబోతోంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వయం.ఆ వివరాల్లోకి వెళితే… ‘జులాయి’, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి ఘన విజయాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘అలకనంద’ (ప్రచారంలో ఉన్న పేరు). భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో… ఓ సీనియర్ యాక్టర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.

మెగా హీరో చిత్రంలో కేరళకుట్టి?
మెగా కాంపౌండ్ నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకటిన్నర దశాబ్దం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో… శ్రీరామచంద్ర మూర్తిగా కీలక పాత్రలో కనిపించిన మాస్టర్ వైష్ణవ్ తేజ్(సాయి తేజ్ తమ్ముడు)… ఇప్పుడు మిస్టర్ వైష్ణవ్ తేజ్‌గా ఎదిగి కథానాయకుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు.