మన హీరోలు “బిగ్గర్ దేన్ ద లైఫ్” క్యారెక్టర్స్ నుండి “లైఫ్ సైజ్” క్యారెక్టర్స్ వైపు మరలటo ఒక శుభ పరిణామం గా అనిపిస్తుంది. అందుకేనేమో వరుసగా మూడు వారాలలో టాలీవుడ్ కు మూడు వరుస విజయాలు లభించాయి. ఏప్రిల్ 5న విడుదలైన” మజిలీ”, ఏప్రిల్ 12న విడుదలైన ” చిత్రలహరి” , ఈరోజు అంటే ఏప్రిల్ 19న విడుదలైన” జెర్సీ”చిత్రాలు విజయ పథంలో నడవటానికి ఈ మూడు చిత్రాల కథాంశాలు నేల విడిచి సాము చేయకపోవటమే ప్రధాన కారణం. కమర్షియల్ ఎలిమెంట్స్ ను నెగ్లెట్ చేయకుండానే హ్యూమన్ ఎమోషన్స్ కు ప్రాధాన్యతనిస్తూ రూపొందిన ఈ మూడు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
కాగా ఈరోజు విడుదలైన ” జెర్సీ” ని పర్ఫెక్ట్ బ్లెండింగ్ఆ ఫ్ ఎమోషన్స్ అండ్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ గా అభినందించవచ్చు. ఇండియాలో క్రికెట్ అన్నది ఒక మతంగా, కోట్లాది అభిమానుల అభిమతంగా మారిన ఈ తరుణంలో క్రికెట్ నేపథ్యంలో ఒక సినిమా రావటం సమ్థింగ్ డిఫరెంట్. అదీ ఒక ప్రాంతీయ భాషలో క్రికెట్ మీద ఇంత సాధికారికంగా ఒక సినిమాను రూపొందించిన దర్శక నిర్మాతలను, హీరోను అభినందిస్తూ “జెర్సీ” రివ్యూలోకి ఎంటర్ అవుదాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అర్జున్( నాని) ఒక రంజీ క్రికెట్ ప్లేయర్. నేషనల్స్ కు సెలెక్ట్ అవ్వాలన్నది అతని డ్రీమ్. తనలో ఉన్న టాలెంటును తనకంటే ఎక్కువగా గుర్తించినకోచ్ (సత్యరాజ్) అర్జున్ ను బాగా ఎంకరేజ్ చేస్తాడు. క్రికెట్ లో జాతీయ స్థాయి ప్లేయర్ గా రాణిస్తాడు అనుకున్న అర్జున్ రంజీ స్థాయిలోనే ఆగిపోతాడు. సారా ( శ్రద్దా శ్రీనాథ్) ప్రేమలో మనసారా మునిగిపోయిన కారణంగానే అతను క్రికెట్ ను నెగ్లెట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. క్రికెట్ కెరీర్ ను మధ్యలోనే వదిలేసి సారాను పెళ్లి చేసుకున్న అర్జున్ కు నాని( మాస్టర్ రోనీత్ కమ్రా) పుడతాడు. కొడుకు పుట్టిన కొద్ది రోజులకే అర్జున్, సారా మధ్య విభేదాలు పొడచూపాయి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగం కూడా పోతుంది. క్రికెటర్ గా రాణించక, మరొకవైపు ఉద్యోగం లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అర్జున్ ఒక లూసర్ గా మిగిలిపోతాడు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కొడుకు బర్త్ డే గిఫ్ట్ గా అడిగిన 500 రూపాయల క్రికెట్ ” జెర్సీ” ని కూడా కొని ఇవ్వలేని నిస్సహాయ స్థితిలోఉన్న అర్జున్ జీవితం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది.? రంజీ స్థాయిలోనే ఆగిపోయిన అర్జున్ కెరీర్ నేషనల్స్ కు ఆడే స్థాయికి ఎలా ఎదిగింది? అసలు గొప్ప ప్లేయర్ గా ఎదుగుతున్న తరుణంలో అర్జున్ క్రికెట్కు దూరం అవ్వటానికి కారణం ఏమిటి? 36 ఏళ్ల లేటు వయసులో మరలా క్రికెట్లోకి అర్జున్ ఎలా ఎంటర్ అయ్యాడు? అందుకు కారణం ఎవరు? ఇత్యాది సందేహాలకు సమాధానంగా నిలుస్తుంది “జెర్సీ” ద్వితీయార్థం. ముఖ్యంగా ఉజ్జ్వలంగా ఎదుగుతున్న తరుణంలో అర్జున్ క్రికెట్ ఆడను అని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో తెలియక క్యారెక్టర్ పట్ల సానుభూతికి బదులు ప్రేక్షకుల్లో చిరాకు ప్రారంభమవుతుంది. కానీ క్రికెట్ మానేయటానికి అసలు కారణం తెలిసినప్పుడు మాత్రం ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది.
హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్:
తెలుగు ప్రేక్షకులకు క్రికెట్ ఎంత సుపరిచితమో క్రికెట్ నేపథ్యంలో ఒక సినిమా చూడటం అంత కొత్త అనుభూతి. క్రికెట్ నేపథ్యాన్ని తీసుకున్నాను కాబట్టి దాన్ని బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ తో చుట్టేద్దాం అనుకోకుండా ప్రత్యక్షంగా స్టేడియం లోనో, టీవీ ముందో కూర్చుని క్రికెట్ చూస్తున్న లైవ్ అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చినందుకు దర్శకుడు గౌతమ్ ను మనసారా అభినందించాలి. చెక్ దే ఇండియా, దంగల్ వంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రాలలో ఆ స్పోర్ట్స్ పార్ట్ ను ఎంత అథన్టిక్ గా చూపించారో ” జెర్సీ”లో క్రికెట్ క్రీడను అంత డీటెయిల్డ్ గా చిత్రీకరించడంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అలాగే పాత్రల మధ్య భావ సంఘర్షణను కూడా చాలా హృద్యంగా చిత్రీకరించారు. క్రికెట్ నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను బలవంతంగా ఇంజెక్ట్ చేయటానికి ప్రయత్నించకుండా సహజ సన్నివేశాలతో, నేచురల్ ఫ్లో ఆఫ్ టేకింగ్ తో అలరించాడు దర్శకుడు గౌతమ్.
ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్:
ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అర్జున్ గా నాని, నాని గా మాస్టర్ రోనీత్ సింప్లీ సూపర్బ్ అనిపించారు. తన సినిమాల రిలీజ్ కు ముందు ఎప్పుడు తను చేస్తున్న పాత్రల గురించి, కథల గురించి ఎక్కువగా మాట్లాడని నాని “జెర్సీ” గురించి జరంత ఎక్కువే మాట్లాడాడు అనిపించింది. కానీ సినిమా చూసిన తరువాత నాని చెప్పిన దాంట్లో కాన్ఫిడెన్స్ తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ మాత్రం లేదు అనిపించింది.. తనకున్న “నేచురల్ స్టార్ ” అనే క్రెడిట్ కు తను హండ్రెడ్ పర్సెంట్ అర్హుడు అని నిరూపించుకుంటూ జెర్సీ లో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నాని కి అభినందనలు. ఇక నాని కొడుకు నాని గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ “రోనీత్ కమ్రా” చాలా ముద్దుగా పర్ఫార్మ్ చేసి “షో స్టీలర్” అయ్యాడు. ఇక హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కూడా చాలా సహజంగా మధ్యతరగతి గృహిణిగా, ఉద్యోగిగా సారా పాత్రలో ఒదిగిపోయింది. “బాహుబలి కట్టప్ప” తరువాత జెర్సీ లో క్రికెట్ కోచ్ గా సత్యరాజ్ కు మరొక మెమరబుల్ క్యారెక్టర్ దక్కింది. హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మిగిలిన పాత్రల్లో రావు రమేష్, సంపత్, నవీన్, బ్రహ్మాజీ తదితరులు up to the mark అనిపించారు.
ఇక టెక్నికల్ గా అనిరుద్ మ్యూజిక్, సాను వర్గిస్ సినిమాటోగ్రఫీ, నవీన నూలి ఎడిటింగ్ అప్ టూ ద రిక్వైర్మెంట్ ఉన్నాయి. ఇక తెర వెనుక ప్రశంసార్హమైన విశేషంగా చెప్పుకోవలసింది సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ making standards ను ప్రత్యేకం గా అభినందించాలి. ముఖ్యంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ ను సహజంగా, వాస్తవ నేపథ్యంలో చిత్రీకరించటానికి కావలసిన ప్రొడక్షన్ వాల్యూస్ ను నిర్మాతలు ప్రొవైడ్ చెయ్యకపోతే ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావు. న్యూజిలాండ్ టీం తో క్రికెట్ మ్యాచ్ సన్నివేశాన్ని ఒరిజినల్ న్యూజిలాండ్ ప్లేయర్స్ తో చిత్రీకరించడం నిర్మాతల taste and standards కు నిదర్శనం. మొత్తం మీద దర్శకుడి విజన్, హీరో నిర్మాతల నమ్మకం ఒక్క తాటి మీద నడిచినప్పుడే “జెర్సీ” వంటి వైవిధ్యమైన ప్రయోగాలకు అవకాశం ఏర్పడుతుంది.
ఇక డిఫరెంట్ అటెంప్ట్ గా అభినందనలు అందుకుంటున్న “జెర్సీ”లో ప్లస్ ల మైనస్ ల విభజన, విశ్లేషణ అనవసరం. అక్కడక్కడ మందగించిన వేగం, ఇంకొంచెం హిలేరియస్ గా నరేట్ చేయలేకపోవటం మినహా అన్ని విధాల అలరించే డిఫరెంట్, డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఫిలిం “జెర్సీ”.
[wp-review id=”19354″]
[subscribe]
[youtube_video videoid=bxDtIMt66js]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: