సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక్కోసారి ఆ సెంటిమెంట్స్‌తోనే విజయాలు కూడా వరిస్తుంటాయి. అలా… తమ కాంబినేషన్ సినిమాలకు కలిసొచ్చిన ఓ సెంటిమెంట్‌ని మరోసారి రిపీట్ చేయబోతోంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వయం.ఆ వివరాల్లోకి వెళితే… ‘జులాయి’, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి ఘన విజయాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అలకనంద’ (ప్రచారంలో ఉన్న పేరు). భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో… ఓ సీనియర్ యాక్టర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ నటుడే… నటకిరీటి రాజేంద్రప్రసాద్. ఎందుకంటే… బన్నీ, త్రివిక్రమ్ గత రెండు చిత్రాల్లోనూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించి ఆ యా విజయాల్లో భాగమయ్యాడు. ‘జులాయి’లో ఎ.సి.పి.సీతారాం పాత్రలో భయపడే పోలీస్ ఆఫీసర్‌గా తన మార్కు కామెడీని పండించగా…. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో తోటి మనుషుల విలువలను లెక్క చేయని సాంబశివరావు పాత్రలో కామెడీతో పాటు భావోద్వేగ సన్నివేశాలలోనూ ప్రేక్షకులను అలరించాడు ఈ హాస్య కిరీటి. ఈ నేపథ్యంలో ‘అలకనంద’లోనూ రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తుండడంతో ఆసక్తి నెలకొంది. మరి ఈసారి కూడా రాజేంద్ర ప్రసాద్ సెంటిమెంట్ వర్కవుట్ అయి.. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌కి హ్యాట్రిక్ విజయం దక్కుతుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=lS5CrgkciTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























